బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండవ మ్యాచ్ కు సిద్దమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, అడిలైడ్‌లో భారత్‌తో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లను జట్టులో చేర్చుకుంది.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్‌కు “తక్కువ-గ్రేడ్ లెఫ్ట్ సైడ్ గాయం” అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ గాయం కారణంగా హేజిల్‌వుడ్ రెండో టెస్టులో ఆడకపోయినా, మిగిలిన సిరీస్‌కు సిద్ధం కావడానికి జట్టుతోనే ఉండనున్నాడు. హేజిల్‌వుడ్ లేకపోవడం స్కాట్ బోలాండ్‌కు అవకాశం కల్పించేలా ఉంది. ఇప్పటికే జట్టులో భాగమైన బోలాండ్, జులై 2023లో ఇంగ్లాండ్‌తో హెడ్డింగ్లీలో తన చివరి టెస్టు ఆడాడు. డే-నైట్ టెస్టులో అతనికి చాన్స్ దక్కుతుందని ఊహిస్తున్నారు.
ఇక ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయంతో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అతను కూడా పెర్త్ టెస్టులో గాయపడ్డాడు. మార్ష్ గైర్హాజరీకి బ్యూ వెబ్‌స్టర్‌ను కవర్‌గా గురువారం జట్టులోకి పిలిచారు. ఆస్ట్రేలియా సీమ్ డిపార్ట్‌మెంట్‌కు హేజిల్‌వుడ్ లేనందున కొంత బలహీనత కనిపించినా, కొత్తగా జట్టులో చేరిన ఆటగాళ్లు తమ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే నమ్మకంతో ఉంది.
JUST IN: Josh Hazlewood ruled out of the second #AUSvIND Test with uncapped duo called up. Full details 👇https://t.co/ZHrw3TUO8a
— cricket.com.au (@cricketcomau) November 30, 2024