AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: 16 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఓ మ్యాచ్‌ గెలిచిన ఆస్ట్రేలియా! ఇదో నమ్మలేని నిజం

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. లాహోర్‌లో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు 350 పరుగులు దాటాయి. 16 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా తమ తొలి ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని సాధించింది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన విజయం కూడా.

Champions Trophy: 16 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఓ మ్యాచ్‌ గెలిచిన ఆస్ట్రేలియా! ఇదో నమ్మలేని నిజం
Aus Vs Eng
SN Pasha
|

Updated on: Feb 23, 2025 | 8:07 AM

Share

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడింది. శనివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. ఇరు టీమ్స్‌ కూడా 350 పరుగుల పైనే స్కోర్‌ చేయడంతో ఈ మ్యాచ్‌లో ఏకండా 707 పరుగులు నమోదు అయ్యాయి. హై స్కోరింగ్‌ మ్యాచ్‌గా సాగిన ఈ పోటీలో చివరి ఆస్ట్రేలియా గెలిచింది. ఈ విజయంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన జట్టుగా ఆసీస్‌ నిలిచింది. ఈ అద్బుతమైన రికార్డుతో పాటు 16 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి విజయం సాధించింది ఆస్ట్రేలియా.

అదేంటి ఆస్ట్రేలియా అంటే ఛాంపియన్‌ టీమ్‌ కదా.. వాళ్లకు 16 ఏళ్లుగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో గెలుపు అనేదే లేదా? మేం నమ్మం అని అంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 2009 తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఇదే మొట్టమొదటి విజయం. అయితే 2009 తర్వాత కేవలం రెండే ఛాంపియన్స్‌ ట్రోఫీలు జరిగిన విషయం తెలిసిందే. 2013, 2017లో మాత్రమే ఛాంపియన్స్‌ ట్రోఫీలను నిర్వహించింది ఐసీసీ. అంతకు ముందు 2006, 2009లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. కానీ, 2013, 2017 ఈ రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. రెండు సెషన్లు కలిపి మొత్తం 6 మ్యాచ్‌లు అనుకుంటే మూడు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి లేదా ఫలితం తేలలేదు. మరో మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.

2013లో ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓడిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. అలాగే బంగ్లాదేశ్‌తో కూడా వర్షం వల్లే మ్యాచ్‌ పూర్తిగా జరగలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఓటమి పాలైంది. ఇలా చివరి రెండు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆసీస్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. అప్పుడెప్పుడో 2009లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ గెలిచిన ఆస్ట్రేలియా మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.