30 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లు.. 276 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను చితకబాదిన తుఫాన్ బ్యాటర్..

|

Jun 08, 2022 | 9:27 AM

హాంప్‌షైర్ తరపున ఓ బ్యాట్స్‌మెన్ కేవలం 30 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో 276.66 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను బాదేశాడు.

30 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లు.. 276 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను చితకబాదిన తుఫాన్ బ్యాటర్..
Ben Mcdermott
Follow us on

ఈ ఆటగాడి వయస్సు 27 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు వెళ్లిన దారిలో నడవకుండా, తన స్వంత నిర్ణయాన్ని అమలుపరిచాడు. దీంతో ఫాస్ట్ బౌలర్ అనే ట్యాగ్ నుంచి వికెట్‌ కీపర్‌ కం బ్యాట్స్‌మెన్‌గా మారాడు. ఆయనే ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ మెక్‌డెర్మాట్(Ben McDermott). అతని తండ్రి ఫాస్ట్ బౌలర్. అతని సోదరుడు కూడా తండ్రిలాగే పేసర్ అయ్యాడు. కానీ, మెక్‌డెర్మాట్ బౌలర్లను చిత్తు చేసే బ్యాట్స్‌మెన్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఆడుతున్న T20 బ్లాస్ట్‌లో హాంప్‌షైర్ క్లబ్ కోసం ఈ పని చేస్తున్నాడు.

బెన్ మెక్‌డెర్మాట్ మిడిల్‌సెక్స్‌పై బ్యాట్‌తో సరికొత్త తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జూన్ 7న జరిగిన మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్‌సెక్స్ హాంప్‌షైర్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మెక్‌డెర్మాట్ బ్యాటింగ్ దెబ్బకు, లక్ష్యం చాలా చిన్నదైంది. అతను నిరంతరం సిక్సర్ల వర్షం కురిపిస్తూ కనిపించాడు. ఫలితంగా కేవలం 30 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించేశాడు.

ఇవి కూడా చదవండి

ఆసీస్ బ్యాట్స్‌మెన్ 30 బంతుల్లోనే దబిడ దిబిడ..

మిడిల్‌సెక్స్ నుంచి లక్ష్యాన్ని ఛేదించిన బెన్ మెక్‌డెర్మాట్ 276.66 స్ట్రైక్ రేట్‌తో 30 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 9 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. అంటే చూస్తే కేవలం 14 బంతుల్లోనే బౌండరీలతో ​​74 పరుగులు రాబట్టాడు.

ఈ భయానక ఇన్నింగ్స్‌లో, మెక్‌డెర్మాట్ ఓపెనింగ్ వికెట్‌కు హాంప్‌షైర్ కెప్టెన్ జేమ్స్ విన్స్‌తో కలిసి 9.4 ఓవర్లలో 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది మ్యాచ్‌ను జట్టు ఒడిలోకి వచ్చేలా చేసింది. ఈ భాగస్వామ్యంలో విన్స్ 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ 12 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బెన్ మెక్‌డోర్మాట్ తుఫాన్ ఇన్నింగ్స్..

కాగా, T20 బ్లాస్ట్‌లో బెన్ మెక్‌డెర్మాట్‌కి ఇది మొదటి తుఫాన్ ఇన్నింగ్స్ కాదు. బదులుగా, దీనికి ముందు, అతను బ్యాట్‌తో 12 బంతుల్లో 29 పరుగులు, 35 బంతుల్లో 60 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఇదే ఫామ్‌ కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పవని నెటిజన్లు అంటున్నారు.