Aus vs Pak: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ.. హరీస్ రౌఫ్‌కు కరోనా నిర్ధారణ..

పాకిస్థాన్ , ఆస్ట్రేలియా మధ్య చరిత్రాత్మక టెస్టు సిరీస్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి...

Aus vs Pak: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ.. హరీస్ రౌఫ్‌కు కరోనా నిర్ధారణ..
Ravuf
Follow us

|

Updated on: Mar 01, 2022 | 6:31 PM

పాకిస్థాన్ , ఆస్ట్రేలియా మధ్య చరిత్రాత్మక టెస్టు సిరీస్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శుక్రవారం మార్చి 4 నుండి రావల్పిండిలో ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే పాక్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు కరోనా సోకింది. రవూఫ్ మార్చి 1 మంగళవారం వరకు పాకిస్థాన్ జట్టుతో ప్రాక్టీస్ చేశాడు. కరోనా పాజిటివ్ రావడంతో అతను ఐసోలేషన్‌కు వెళ్లాడు.

“మంగళవారం పాకిస్థానీ పేసర్ రౌఫ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. అది పాజిటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత అతను వెంటనే హోటల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు.” ఓ వార్త సంస్థ తెలిపింది. రవూఫ్ మంగళవారం ఉదయం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు, సరైన సమయంలో మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఉటంకిస్తూ జియో న్యూస్ నివేదిక పేర్కొంది.

ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న లాహోర్ క్వాలండర్స్ జట్టులో హరీస్ రౌఫ్ సభ్యుడిగా ఉన్నాడు. లాహోర్ క్వాలండర్స్ ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్ గెలిచిన తర్వాత, జట్టు ఆటగాళ్లు తమ ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌ను కలవడానికి వెళ్లారు. అతను కరోనా లక్షణాల కారణంగా కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నాడు.

గత రెండేళ్లుగా పాకిస్థాన్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రవూఫ్, ఇప్పటి వరకు ఆ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడలేదు. అయితే ఇప్పటికే పాక్ జట్టు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఈసారి అరంగేట్రం చేస్తాడని అనుకున్నారు. ఆ జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్లు హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ గాయాల కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు రవూఫ్ కూడా మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

Read Also.. IND vs SL: సచిన్‌కు సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డు.. 100వ టెస్టులో విరాట్ పూర్తి చేసేనా.. లిస్టులో ఎవరున్నారంటే?