IND vs SL: టీ20లో అలా చేయడం పెద్ద క్రైమ్.. ఒత్తిడికి వెల్కం చెబితే కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే: శ్రేయాస్ అయ్యర్

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటు ఘాటుగా స్పందించింది. 3 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు. అయ్యర్ మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

IND vs SL: టీ20లో అలా చేయడం పెద్ద క్రైమ్.. ఒత్తిడికి వెల్కం చెబితే కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే: శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer
Follow us
Venkata Chari

|

Updated on: Mar 01, 2022 | 5:43 PM

Shreyas Iyer: శ్రీలంక(IND vs SL)తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా(Team India) బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటు ఘాటుగా స్పందించింది. 3 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు. అయ్యర్ మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయ్యర్ తన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. తన తోటి ఆటగాళ్లతోపాటు, సారథి రోహిత్ శర్మ గురించిన పలు విషయాలు పంచుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పొట్టి ఫార్మాట్‌లో డాట్ బాల్ ఆడితే చాలా కష్టం.. టీమ్ ఇండియాను పవర్ ఫుల్‌గా అభివర్ణించిన అయ్యర్.. జట్టులో ఒక రకమైన పిచ్చి ఉందని చెప్పాడు. ‘బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే ఆటగాళ్లంత ప్రతిభావంతులుగా ఉన్నారు. బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల శక్తి ఉంటుంది. టీ20 క్రికెట్‌లో ప్రతి బంతికి పరుగులు చేయడం గురించి ఆలోచించాలి’ అని తెలిపాడు.

‘ఒక బ్యాట్స్‌మెన్‌గా డాట్ బాల్ ఆడితే అది నేరంగా భావిస్తాను. డాట్ బాల్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెస్తుంది. వెస్టిండీస్ జట్టును చూస్తే, వారు ఎల్లప్పుడూ మొదటి బంతి నుంచి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. టీ20 క్రికెట్‌లో మంచి స్కోరు సాధించాలి’ అని అయ్యర్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మను ప్రశంసించిన అయ్యర్, ‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతమైనవాడు. అతను ఆటగాడి కోణం నుంచి ఆలోచిస్తాడు. అతను ప్రతి క్రీడాకారుడిని అర్థం చేసుకుంటాడు. కోచ్, సహాయక సిబ్బంది నుంచి వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుంటాడు. దేశవాళీ క్రికెట్‌లో రోహిత్ శర్మ నాకు బాగా తెలుసు. అతను ఏమనుకుంటున్నాడో కూడా నాకు తెలుసు. జట్టు వాతావరణం ఖచ్చితంగా అద్భుతమైనది’ అని వివరించాడు.

గాయం తర్వాత బలమైన పునరాగమనం ఎలా చేశారనే ప్రశ్నకు సమాధానంగా.. ‘గాయం తర్వాత ప్రవీణ్ ఆమ్రే తనకు చాలా సహాయం చేశాడు. అతని కారణంగానే త్వరగా జట్టులోకి రాగలిగాను. అలాగే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ కూడా పెద్ద పాత్ర పోషించారు. అతను బెస్ట్ ట్రైనర్. నాకు ఎలాంటి శిక్షణ కావాలో రజనీకాంత్‌కు తెలుసు. ఒక క్రీడాకారుడు మూడు ఫార్మాట్లలో ఆడటానికి ఏమి అవసరమో రజనీకాంత్‌కు తెలుసు. గాయం నుంచి తిరిగి పునరాగమనం చేయడంలో అతను నాకు సహాయం చేశాడు. NCAలో కూడా నాకు చాలా సహాయం లభించింది’ అని పేర్నొన్నాడు.

టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగా ఉంది.. భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రతి బ్యాట్స్‌మెన్ ఏ స్థానంలోనైనా మంచి ప్రదర్శనను చూడాలని కోరుకుంటుంది. దీనిపై అయ్యర్ మాట్లాడుతూ, ‘న్యూజిలాండ్ పర్యటనలో నా పాత్ర నాకు బాగా తెలుసు. నేను ఏ నంబర్‌లో ఆడతానో కూడా నాకు తెలుసు. ప్రస్తుతం జట్టులో ఏ ప్లేస్‌లోనైనా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అలాంటి సందర్భంలో నిరూపించుకోవడం చాలా ముఖ్యం. ఇదే టీమ్ ఇండియా విజన్’ అని తెలిపాడు.

Also Read: IND vs SL: సచిన్‌కు సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డు.. 100వ టెస్టులో విరాట్ పూర్తి చేసేనా.. లిస్టులో ఎవరున్నారంటే?

IPL 2022: ఆర్‌సీబీ కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. కోహ్లీ వారసుడిగా ఆయనవైపే మొగ్గు.. త్వరలో ప్రకటించే ఛాన్స్?