AUS vs IND: పెర్త్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 295 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం

|

Nov 25, 2024 | 2:23 PM

ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

AUS vs IND: పెర్త్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. 295 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం
India Vs Australia
Follow us on

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద టెస్టు విజయం. ఇంతకు ముందు 1977లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో టీమిండియా 222 పరుగుల తేడాతో గెలుపొందింది. సరిగ్గా 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ విధించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 12/3 తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 238 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఆసీస్‌పై టీమ్‌ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3, సిరాజ్ 3, వాషింగ్టన్ సుందర్ 2.. నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. కాగా ఆస్ట్రేలియా గడ్డపై  భారత్‌కిదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

 

ఇవి కూడా చదవండి

ఆప్టస్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. ఆ  తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు భారత పేసర్ల ధాటికి 104 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరఫున బుమ్రా 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా, కేఎల్ రాహుల్, యస్షవ్ జైస్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్య తర్వాత రాహుల్ (77)  ఔటయ్యాడు. మరోవైపు 297 బంతులు ఎదుర్కొన్న యస్సవ్ జైస్వాల్ 3 సిక్సర్లు, 15 ఫోర్లతో 161 పరుగులు చేశాడు. నాలుగో నంబర్‌లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 143 బంతుల్లోనే భారీ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీల సాయంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

534 పరుగుల లక్ష్యం:

తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల లోటుతో  534 పరుగుల లక్ష్యాన్నిఛేదాంచేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కు  జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఫలితంగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఇక నాలుగో రోజు ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ ఉస్మాన్ ఖ్వాజా (4), స్టీవ్ స్మిత్ (17) వికెట్లు తీశారు. ఈ దశలో భాగస్వామ్యమైన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్  అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఈ దశలో బుమ్రా ట్రావిస్ హెడ్ (89) వికెట్ పడగొట్టగా, నితీశ్ రెడ్డి బౌలింగ్ లో మిచెల్ మార్ష్ (47) అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్లు మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించి ఆస్ట్రేలియా జట్టును 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా 295 పరుగుల భారీ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

47 ఏళ్ల రికార్డు బద్దలు..

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..