ICC T20 World Cup Australia vs India Playing XI: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 51వ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. సూపర్ 8 రౌండ్ లో ఇది చివరి మ్యాచ్. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సూపర్ 8లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను టీమిండియా ఓడించింది. మరోవైపు బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. కాబట్టి, ఇప్పుడు సెమీఫైనల్ బెర్తును నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ జట్టు దూకుడుగా ఆడే అవకాశముంది.
టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిక్యం కనబరిచింది. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో ఓడింది. కాగా కంగారూలు 11 సార్లు విజయం సాధించారు. 8 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడుతున్నాయి. అంతకుముందు ఇరు జట్లు చివరిసారిగా 2016లో తలపడ్డాయి. మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
🚨 Toss Update 🚨
Australia have elected to bowl against #TeamIndia.
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #AUSvIND pic.twitter.com/d0UV4A4iRr
— BCCI (@BCCI) June 24, 2024
A look at our Playing XI 💪 🔽
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #TeamIndia | #AUSvIND pic.twitter.com/e6rZgs2rb0
— BCCI (@BCCI) June 24, 2024
Must win.
Watch live and exclusive through Amazon Prime 👉 https://t.co/cJt63MTgw6#T20WorldCup pic.twitter.com/piP0ZGwLJv
— Cricket Australia (@CricketAus) June 24, 2024