IND vs AUS: ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోన్న బుమ్రా.. 2వ రోజు తగ్గేదేలే.. అరుదైన జాబితాలో చోటు..

|

Nov 23, 2024 | 8:19 AM

Jasprit Bumrah Record-Breaking Bowling: పెర్త్‌లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బుమ్రా ధాటికి ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో బుమ్రా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇదే ఊపుతో రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే తన 5 వికెట్ల హాల్‌ను పూర్తి చేశాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోన్న బుమ్రా.. 2వ రోజు తగ్గేదేలే.. అరుదైన జాబితాలో చోటు..
Jasprit Bumrah
Follow us on

పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేయగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఆస్ట్రేలియాను ఇంత తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. అలాగే, రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే బూమ్రా తన 5 వికెట్ల హాల్‌ను పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తన రెండో టెస్ట్ ఫిఫర్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అతను ఈ ఫీట్ సాధించే క్రమంలో 2వ రోజు తన మొదటి బంతికి అలెక్స్ కారీని పెవిలియన్ చేర్చాడు. ఆసీస్ వికెట్ కీపర్ 13 బంతుల్లో 21 పరుగులు చేసి రిషబ్ పంత్‌ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో బుమ్రా టెస్టుల్లో 11వసారి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్సీని బుమ్రా స్వీకరించాడు. నాయకత్వంతో పాటు బౌలింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యత బుమ్రాపై ఉంది. బుమ్రా ఈ బాధ్యతను తెలివిగా నిర్వహించి తొలిరోజు 10 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా తన ఎనిమిదో టెస్టు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు.

దీంతో ఆస్ట్రేలియాలో 35 టెస్టు వికెట్లు తీసిన మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలు కొట్టాడు. కపిల్ దేవ్ (51 వికెట్లు), అనిల్ కుంబ్లే (49 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (39 వికెట్లు) మాత్రమే ఈ జాబితాలో అతని కంటే ముందున్నారు.

దీంతో పాటు ఆసీస్ బ్యాటింగ్ విభాగంలో తొలి 3 వికెట్లు తీసిన జస్ప్రీత్.. తన పేరిట ఓ పెద్ద రికార్డును రాసుకుని డేల్ స్టెయిన్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను బుమ్రా గోల్డెన్ డక్‌తో ఔట్ చేశాడు. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు డేల్ స్టెయిన్ మాత్రమే స్మిత్‌ను గోల్డెన్ డక్‌తో ఔట్ చేశాడు.

అంతేకాకుండా, బుమ్రా గత 24 ఏళ్లలో అత్యుత్తమ బౌలింగ్ సగటు కలిగిన బౌలర్. 2000 నుంచి 100కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా బౌలింగ్ సగటు 20.3. అంటే ప్రతి 20.3 బంతుల్లో ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో 20.8 సగటుతో ఈ ఘనత సాధించిన ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను బుమ్రా అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..