Ashes 2021: కేప్ టౌన్ నుంచి అడిలైడ్ వరకు.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా మాజీ సారథి..!

AUS vs ENG: 2018లో కేప్ టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Ashes 2021: కేప్ టౌన్ నుంచి అడిలైడ్ వరకు.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా మాజీ సారథి..!
Aus Vs Eng Australia Star Player Steve Smith
Follow us
Venkata Chari

|

Updated on: Dec 16, 2021 | 9:21 AM

Australian Cricket Team: క్రికెట్ మైదానంలో చీకటి అధ్యాయాలలో ఒకటి 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ ఉంటుందనే వాస్తవం. ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్ ఇది. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ ఎవరూ ఊహించని విధంగా షాక్‌లు తగిలాయి. స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియన్ జట్టు బాల్ ట్యాంపరింగ్ వంటి బ్లాక్ యాక్ట్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బ్యాట్స్‌మెన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతిపై ఇసుక అట్టను రుద్దుతూ కెమెరాలకు చిక్కారు. బ్యాన్ క్రాఫ్ట్‌ను ఆడకుండా తొమ్మిది నెలల పాటు నిషేధించారు. అదే సమయంలో, స్మిత్, వార్నర్‌లపై ఒక్కో సంవత్సరం. అయితే వీరిద్దరిపై మరో నిషేధం కూడా విధించారు. వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి జీవితకాలం, స్మిత్‌పై రెండేళ్లపాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.

స్మిత్‌పై నిషేధం ముగిసింది. ఈ నిషేధం ముగిసే సమయం వచ్చినప్పటికీ స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ దక్కలేదు. కానీ, అదృష్టం బహుశా స్మిత్‌ను కెప్టెన్‌గా కోరుకుంది కాబోలు. అందుకే ఇలా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో స్మిత్ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. మూడేళ్ల తర్వాత కెప్టెన్‌గా మళ్లీ వచ్చాడు. యాషెస్ సిరీస్‌కు ముందు స్మిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టిమ్ పైన్ వివాదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశాడు. అతని స్థానంలో పాట్ కమ్మిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయితే కోవిడ్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండడంతో కమ్మిన్స్‌ను రెండవ టెస్టు నుండి తొలగించారు. దీంతో స్మిత్‌ను మరోసారి కెప్టెన్‌గా ఎన్నుకున్నారు.

స్మిత్ తిరిగి వచ్చినప్పటి నుంచి టిమ్ పైన్ తర్వాత జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనే చర్చలు పెరిగాయి. పైన్ రాజీనామా చేసినప్పుడు, స్మిత్ కెప్టెన్‌గా తిరిగి రావచ్చని భావించారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఆ బాధ్యతను పాట్ కమిన్స్‌కు అప్పగించి, స్టీవ్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. వైస్‌ కెప్టెన్‌గా నియమితులైన వెంటనే స్మిత్‌ మరోసారి సారథిగా కనిపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.

కెప్టెన్‌గా రికార్డులు.. స్మిత్‌ను చాలా కాలం కెప్టెన్సీ మెటీరియల్‌గా పిలిచేవారు. జట్టు కెప్టెన్సీ నుంచి మైకేల్ క్లార్క్ తప్పుకోవడంతో స్మిత్‌కు ఈ బాధ్యతలు అందాయి. స్మిత్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 34 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో 18 మ్యాచ్‌లు గెలిచి, 10 ఓడిపోయాడు. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఖచ్చితంగా స్మిత్ ఈ మూడేళ్లలో కెప్టెన్సీ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఈ అవకాశం అతని ముందు ఉంది. స్మిత్ దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీని అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో వారి ఇద్దరు అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లేకపోవడం ఆసీస్‌కు చాలా పెద్ద దెబ్బ. గాయం కారణంగా హాజిల్‌వుడ్ రెండో మ్యాచ్ ఆడడం లేదు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించారు.

Also Read: Ashes 2021-22: యాషెస్ సిరీస్‌లో కోవిడ్ కలకలం.. రెండో టెస్ట్‌ నుంచి ఆస్ట్రేలియా సారథి ఔట్.. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం..!

IND vs SA: దక్షిణాప్రికా పయణమైన కోహ్లీసేన.. తొలి టెస్ట్ సిరీస్ విజయం దక్కేనా.. 7 సార్లు నిరాశే..!