T20 Cricket: 240 స్రైక్‌రేట్‌తో దిమ్మతిరిగే ఇన్నింగ్స్.. కేవలం 41 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌తో దిగ్గజాలకు షాక్..
NEPAL vs UAE Asif Khan: రికార్డులు సృష్టించిన వెంటనే బద్దలవుతాయని క్రికెట్‌లో చెబుతుంటారు. యూఏఈ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ ఖాన్ ఈ మాటను మరోసారి నిరూపించాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అసిఫ్ ఖాన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.
రికార్డులు సృష్టించిన వెంటనే బద్దలవుతాయని క్రికెట్‌లో చెబుతుంటారు. యూఏఈ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ ఖాన్ ఈ మాటను మరోసారి నిరూపించాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అసిఫ్ ఖాన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది ఏదైనా అనుబంధిత దేశానికి చెందిన ఆటగాడు చేసిన వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. నేపాల్‌లోని కీర్తిపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఆసిఫ్ ఖాన్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడి తన జట్టును 310 పరుగులకు తీసుకెళ్లాడు.
ఆసిఫ్ ఖాన్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు, 4 ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 240.47గా నిలిచింది. ఈ సెంచరీతో ఆసిఫ్ ఖాన్ భారీ ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
లారా రికార్డ్ బ్రే చేసిన ఆసిఫ్ ఖాన్..
ఆసిఫ్ ఖాన్ తన అర్ధ సెంచరీని 30 బంతుల్లో పూర్తి చేశాడు. అయితే ఈ ఆటగాడు తర్వాతి 11 బంతుల్లో సెంచరీని చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టుపై అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాడిగా ఆసిఫ్ ఖాన్ నిలిచాడు. ఇంతకుముందు 1999లో బంగ్లాదేశ్‌లో 45 బంతుల్లో సెంచరీ చేసిన బ్రియాన్ లారా పేరిట ఈ రికార్డు ఉంది. షాహిద్ అఫ్రిది కూడా భారత్‌లో 45 బంతుల్లోనే సెంచరీ సాధించగా, ఇప్పుడు ఈ రికార్డు ఆసిఫ్ ఖాన్ పేరిట నమోదైంది.
Scorching quick-fire century by Asif Khan in just 41 balls!
#CWCL2 #NEPvUAE #weCAN pic.twitter.com/dbfPIMLwZu
— CAN (@CricketNep) March 16, 2023
మార్క్ బౌచర్‌ను అధిగమించిన ఆసిఫ్..
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మార్క్ బౌచర్‌ను ఆసిఫ్ ఖాన్ బ్రేక్ చేశాడు. బౌచర్ 44 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాగా, 2015లో 31 బంతుల్లో సెంచరీ చేసిన ఏబీ డివిలియర్స్ పేరిట వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రికార్డు అలాగే నిలిచి ఉంది. 2014లో కోరీ అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఆసిఫ్ ఖాన్ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. అతను పాకిస్థాన్ అండర్-19 జట్టు తరపున ఆడాడు. కానీ, ఈ ఆటగాడు పాకిస్థాన్‌ను విడిచిపెట్టి.. ప్రస్తుతం యూఏఈ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..