Asia Cup Super 4 Schedule: సూపర్-4కు చేరిన 4 జట్లు.. భారత షెడ్యూల్ ఇదే..!

Asia Cup 2025 Points Table, After AFG vs SL Match: ఆసియా కప్‌ 2025లో నాలుగు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకున్నాయి. భారత్, పాకిస్తాన్ ఇప్పటికే రెండవ రౌండ్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు, ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన తర్వాత, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా సూపర్ ఫోర్‌లో తమ స్థానాన్ని దక్కించుకున్నాయి.

Asia Cup Super 4 Schedule: సూపర్-4కు చేరిన 4 జట్లు.. భారత షెడ్యూల్ ఇదే..!
Asia Cup Super 4 Schedule

Updated on: Sep 19, 2025 | 8:42 AM

Asia Cup 2025 Points Table, After AFG vs SL Match: ఆసియా కప్ 2025లో నాలుగు జట్లు సూపర్ 4లోకి ప్రవేశించాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్ ఇప్పటికే సూపర్ 4కి అర్హత సాధించాయి. ఇక తాజాగా గ్రూప్ బీ నుంచి రెండు జట్లు కూడా రెండవ రౌండ్‌కు చేరుకున్నాయి. సూపర్ 4కి చేరుకోవాలనే ఆఫ్ఘనిస్తాన్ కల చెదిరిపోయింది. మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. గ్రూప్ బీలోని చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్ జట్టును ఓడించింది. దీంతో, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4లోకి ప్రవేశించాయి.

అఫ్గానిస్తాన్ ఆశలపై దెబ్బ కొట్టిన లంక..

గ్రూప్ బీ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, బంగ్లాదేశ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించేది. కానీ శ్రీలంక అలా జరగకుండా నిరోధించింది. ఈ గ్రూప్ లో శ్రీలంక తన మూడు మ్యాచ్ లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. హాంకాంగ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పట్టికలో అట్టడుగున ఉంది.

భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే సూపర్-4లోకి..

గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్ ఇప్పటికే సూపర్ 4 కి అర్హత సాధించాయి. సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నప్పటికీ, మొదటి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, యూఏఈలను ఓడించడం ద్వారా సూపర్ 4 బెర్తును ఖాయం చేసుకుంది.

పాకిస్తాన్, ఒమన్, యూఏఈలను ఓడించి సూపర్ ఫోర్‌కు చేరుకుంది. యుఎఇ ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఒమన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

సూపర్-4లో ఇరుజట్ల మధ్య ఇదే తొలి ఘర్షణ..

2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ ఫోర్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబర్ 20న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 21న పాకిస్తాన్ మళ్లీ టీమిండియాతో తలపడనుంది.

సూపర్ 4 పూర్తి షెడ్యూల్..

బంగ్లాదేశ్ vs శ్రీలంక, సెప్టెంబర్ 20

భారత్ vs పాకిస్తాన్, సెప్టెంబర్ 21

పాకిస్తాన్ vs శ్రీలంక, సెప్టెంబర్ 23

బంగ్లాదేశ్ vs భారత్, సెప్టెంబర్ 24

బంగ్లాదేశ్ vs పాకిస్థాన్, సెప్టెంబర్ 25

భారత్ vs శ్రీలంక, సెప్టెంబర్ 26

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..