
Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత వివాదాలు తలెత్తాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్‌లతో షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారనే వివాదం పెద్ద ఎత్తున జరిగింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
ఏసీసీ తీసుకున్న నిర్ణయం ఏంటి?
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇకపై మీడియా సమావేశాల్లో రాజకీయ ప్రశ్నలు అడగకుండా నిషేధం విధించింది. ఈ కొత్త రూల్ ఓమన్తో జరిగే మ్యాచ్‌కు ముందు నుంచే అమలులోకి వచ్చింది. ఈ ప్రెస్‌మీట్‌లో కుల్‌దీప్ యాదవ్ పాల్గొన్నాడు. కానీ, అంతకుముందే ఏసీసీ మీడియా అధికారి ఒకరు భారతీయ జర్నలిస్టులను రాజకీయ సంబంధిత ప్రశ్నలు అడగవద్దని కోరారని వార్తలు వచ్చాయి. భారత్, పాక్ మ్యాచ్ తర్వాత భారతీయ జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌లో మ్యాచ్‌కు సంబంధం లేని రాజకీయ ప్రశ్నలు అడగడంతో ఏసీసీకి ఇబ్బందిగా మారింది.
పాకిస్తాన్ జట్టు ప్రెస్‌మీట్ ఎందుకు రాలేదు?
వివాదం తర్వాత, పాకిస్తాన్ జట్టు యూఏఈతో జరిగే మ్యాచ్‌కు ముందు ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకుంది. దీనిపై ఐసీసీ సీనియర్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరైన పాక్ జట్టు, తప్పనిసరిగా పాల్గొనాల్సిన ప్రెస్‌మీట్‌ను ఎందుకు స్కిప్ చేసిందని పీసీబీని ప్రశ్నించారు. ఈ వివాదాల మధ్య పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా బెదిరించింది. అయితే, ఐసీసీ జోక్యం చేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పాక్ జట్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.
సూపర్-4 లో మళ్లీ ఇండియా-పాకిస్తాన్
ఆసియా కప్ సూపర్-4 దశలో మరోసారి భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్-ఏలో భారత్ అద్భుతమైన విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ జట్టు కూడా తొలి మ్యాచ్‌లోని బలహీనతలను అధిగమించి పుంజుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ సమతుల్యమైన జట్టుతో, పాకిస్తాన్ వారి పేస్ బౌలింగ్‌తో బరిలోకి దిగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..