Asia Cup India Squad: ఆసియా కప్ బరిలో నిలిచే టీమిండియా స్వ్కాడ్ ఇదే.. సడన్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్..

India's squad for Asia Cup 2023: ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియాకప్ 2023లో పాల్గొనే టీమిండియా స్వ్కాడ్ విడుదలైంది. సోమవారం ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో భారత జట్టు సెలక్టర్ల సమావేశం జరిగింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ హాజరయ్యాడు. అజిత్ అగార్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Asia Cup India Squad: ఆసియా కప్ బరిలో నిలిచే టీమిండియా స్వ్కాడ్ ఇదే.. సడన్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్..
Asia Cup 2023 India Squad

Updated on: Aug 21, 2023 | 1:44 PM

India’s squad for Asia Cup 2023: ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఏ ఆటగాళ్లకు చోటు దక్కుతుంది? ఆశ్చర్యకర ఎంపికలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియాకప్ 2023లో పాల్గొనే టీమిండియా స్వ్కాడ్ విడుదలైంది. సోమవారం ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో భారత జట్టు సెలక్టర్ల సమావేశం జరిగింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ హాజరయ్యాడు. అజిత్ అగార్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. ఇద్దరు బ్యాటర్లు దీర్ఘకాలిక గాయాల నుంచి కోలుకున్నారు. అయితే రెండు నెలల్లోపు ప్రపంచకప్‌ జరగనుండడంతో వీరిద్దరి రీఎంట్రీతో భారత్‌కు భారీ ఊరట లభించింది. వెస్టిండీస్‌లో తన తొలి అంతర్జాతీయ సిరస్ లో ఆకట్టుకున్న తిలక్ వర్మ కూడా జట్టులో ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆసియాకప్ 2023 టీమిండియా జట్టు..

ఐర్లాండ్‌లో అదరగొడుతోన్న జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. ఇందులో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.

ఆసియా కప్‌ బరిలో దిగే టీమిండియా స్వ్కాడ్:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (బ్యాకప్)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..