
Asia Cup 2023 India vs Sri Lanka, Dunith Wellalage: శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో శుభారంభం దొరికినా.. టీమిండియా ఆటగాళ్లు కేవలం 12 వన్డేలు ఆడిన ఓ యువ బౌలర్‌ను అంచనా వేయలేక కుప్పకూలారు. మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకపోయింది రోహిత్ సేన. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియాకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 80 పరుగులతో అద్బుత అయితే 20 ఏళ్ల బౌలర్ దునిత్ వెలలాగే శ్రీలంకకు 3 విజయాలు అందించాడు. అతను శుభమన్ (19),విరాట్ కోహ్లీ(3) మరియురోహిత్ శర్మ(53) వెలలాగే తన మొదటి స్పెల్‌లో 5-1-12-3తో అద్భుతమైన స్కోర్ చేశాడు.
15 గంటల్లోనే రెండో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ కు అవకాశం కల్పించారు. శ్రీలంక వరుసగా 13 వన్డే మ్యాచ్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై లంకతో తలపడుతోన్న రోహిత్ సేన తడబడింది. లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్‌ను ఆడలేక వికెట్లను సమర్పించుకున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వికెట్లను పడగొట్టి సత్తాచాటడంతో.. వెల్లలాగే ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాడు. తొలుత శుభ్మన్, ఆ తర్వాత కోహ్లీ, రోహిత్‌లు ఈ యువ లంక బౌలర్ చేతికి చిక్కారు.
కాగా, శుభ్మన్, రోహిత్‌లు టీమిండియాకు శుభారంభం చేశారు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకపోతున్న తరుణంలో 12వ ఓవర్‌లో శ్రీలంక 20 ఏళ్ల బౌలర్ దునిత్ వెల్లలాగేను తీసుకొచ్చింది. అతను తన స్పిన్ మాయాజాలంతో శుభ్‌మాన్ (19) ను మొదటగా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో రోహిత్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
#INDvsSL Great bold by youngster Dunith Wellalage❤️ pic.twitter.com/PnpJKrKpME
— HIGHLIGHTS (@Bilalsajid91813) September 12, 2023
ఆ తర్వాత రోహిత్ 44 బంతుల్లో సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వెల్లలా గే తన తర్వాతి ఓవర్లో విరాట్ (3)ని క్యాచ్ ఔట్ చేశాడు. పాకిస్తాన్‌పై సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీని కొద్దిసేపు కూడా క్రీజులో నిలబడకుండా చేశాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. రోహిత్ (53)ను పెవిలియన్ చేర్చి, భారత టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. అనంతరం కేఎల్ రాహుల్‌ను 39 పరుగుల వద్ద ఔట్ చేశాడు. దునిత్ వెల్లాలగే బౌలింగ్‌లో అతనికే రివర్స్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేవలం 12 వన్డేలు ఆడిన వెల్లలాగే ఆటతీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Yesterday Kuldeep and today Dimuth Wellalage – This is what a genuine spinner can do for you on Premadasa pitch 👏
Dimuth Wellalage 4/28 in 7 overs#INDvsSL #AsiaCup2023 pic.twitter.com/AgODPf4Hsg
— Shahzaib Ali 🇵🇰 (@DSBcricket) September 12, 2023
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా 29 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఇషాన్ 21, కేఎల్ రాహుల్ 36 పరుగులతో క్రీజులో నిలిచారు.
☝ Shubman Gill
☝ Virat Kohli
☝ Rohit SharmaA stunning spell from Dunith Wellalage sees India’s top three back in the hut 🪄#INDvSL 📝: https://t.co/wrkCBdraLq pic.twitter.com/vOlTAJKSZT
— ICC (@ICC) September 12, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..