Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు కోహ్లీ కీలక నిర్ణయం.. మళ్లీ పరుగుల వరద పారించేనా?

| Edited By: Ravi Kiran

Aug 25, 2022 | 7:05 AM

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన ఈ రన్‌ మెషిన్‌ ఇప్పుడు పూర్తిగా ఫామ్‌ కోల్పోయాడు. అతను సెంచరీ చేసి 1000 రోజులు కూడా దాటిపోయాయి.

Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు కోహ్లీ కీలక నిర్ణయం.. మళ్లీ పరుగుల వరద పారించేనా?
Virat Kohli
Follow us on

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన ఈ రన్‌ మెషిన్‌ ఇప్పుడు పూర్తిగా ఫామ్‌ కోల్పోయాడు. అతను సెంచరీ చేసి 1000 రోజులు కూడా దాటిపోయాయి. ఈక్రమంలోనే తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడటానికి సిద్ధమవుతున్నాడు విరాట్. ఆసియాకప్‌-2022లో భాగంగా ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో తన సెంచరీ మ్యాచ్‌ మార్క్‌ను కోహ్లి అందుకోనున్నాడు. ఈక్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడీ రన్‌ మెషిన్‌. ఇందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తను రెగ్యులర్‌గా వాడుతున్న ఎంఆర్‌ఫ్‌ జీనియస్‌ బ్యాట్‌కు స్వస్తి పలికాడు విరాట్. ఇకపైఎంఆర్‌ఫ్‌ గోల్డ్‌ విజార్డ్‌ బ్యాట్‌తో మైదానంలోకి దిగనున్నాడు.

కోహ్లి కొత్త బ్యాట్‌ విషయానికి వస్తే.. ఎంఆర్‌ఫ్‌ గోల్డ్‌ విజార్డ్‌ 1.15 కిలోగ్రాముల బరువు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోను స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్ అనే వెబ్‌సైట్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ఈ కొత్త బ్యాట్‌ ధర కనీసం 22 వేల రూపాయలు. కాగా ఈ బ్యాట్‌తోనైనా విరాట్ పరుగుల వరద పారించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..