డిసెంబర్ 26 నుంచి ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లూ చెమటోడ్చుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లకు తప్పనిసరి కాబట్టి, గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యాన్ని కొనసాగించడమే కాకుండా WTC ఫైనల్ రేసుకు చేరువలో ఉంటుంది. కానీ ఈలోగా, BCCI భారత జట్టులో కీలక మార్పు చేసింది. గాబా టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్పిన్నర్ ఆర్ అశ్విన్ స్థానంలో యువ స్పిన్నర్‌ను ఎంపిక చేసి, అతన్ని ఆస్ట్రేలియాకు పంపనుంది.
ఇది చదవండి: ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టులో ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోట్యాన్ చోటు దక్కించుకున్నాడు. ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అతని స్థానంలో తనుష్ కొట్యాన్‌కు అవకాశం లభించింది. ఈ ఆటగాడు మంగళవారం మెల్‌బోర్న్‌కు వెళ్లనున్నాడు. తనుష్ కోట్యాన్ కూడా అశ్విన్ లాగా ఆఫ్ స్పిన్నర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో జట్టుకు ఉపయోగకరంగా ఉంటాడు. తాజాగా ఆస్ట్రేలియా ఎతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌లో కూడా ఆడే అవకాశాన్ని ఆ ప్లేయర్ అందుకున్నాడు.
ఇది చదవండి: 16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా.. అలా దంచేశావ్..
26 ఏళ్ల తనుష్ కొట్యాన్ ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు పడగొట్టాడు. కోట్యాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలతో సహా 1525 పరుగులు చేశాడు. కోట్యాన్ గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ప్రస్తుతం అశ్విన్‌కి బదులుగా టీమ్ ఇండియాలో చేరిన తనుష్ కొట్యాన్‌కి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కుతుందా అనేది ప్రశ్న. బుధ లేదా గురువారాల్లో తనుష్ ఆస్ట్రేలియా చేరుకోనుండగా.. డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ఆడే అవకాశాలు తక్కువ. అయితే, అతను సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఆడే అవకాశం లభించవచ్చు. అయితే జడేజా, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండడంతో తనుష్‌కు అవకాశం రావడం కష్టమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి