క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ కూడా ఎంతో ముఖ్యం. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అన్నట్లు ఫీల్డింగ్‌లో రాణించిన జట్టుకే విజయవకాశాలు బాగా ఉంటాయి. అందుకు తగ్గట్లే క్రికెట్ మైదానంలో తరచుగా కనిపించే అద్భుతమైన ఫీల్డింగ్ దృశ్యాలు, విన్యాసాలకు అభిమానుల కళ్లు చెదిరిపోతున్నాయి. తాజాగా గురువారం అడిలైడ్ ఓవల్ మైదానంలో అలాంటిదే కనిపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు అష్టన్ అగర్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో డేవిడ్ మలన్ కొట్టిన సిక్స్‌ను అష్టన్ అగర్ ఒంటిచేత్తో ఆపాడు. పాట్ కమిన్స్ షార్ట్ బాల్‌ను మలన్ అద్భుతమైన పుల్ షాట్ ఆడాగా బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళుతున్నట్లు అనిపించింది. అయితే స్క్వేర్ లెగ్ బౌండరీపై నిలబడిన అష్టన్ అగర్ గాలిలోకి అమాంతం దూకి బంతిని అడ్డుకున్నాడు. దీంతో సిక్సర్ వెళ్లాల్సిన బంతికి కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. అంతకుముందు అగర్ లియామ్ డాసన్‌ను కూడా అద్భుతంగా రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన అగర్ 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
కాగా అగర్ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. వాట్ ఏ ఫీల్డింగ్, టేక్ ఏ బో అంటూ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ 118 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా మలన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 128 బంతుల్లో 12 ఫోర్లు మరియు 4 సిక్సర్ల సహాయంతో 135 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డేవిడ్ వార్నర్ (86), ట్రెవిస్ హెడ్ (69), స్టీవ్‌స్మిత్ (80) రాణించారు.
That’s crazy!
Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
A remarkable effort from Ashton Agar to take this catch on the boundary, hold onto the ball and underarm flick it into play before landing!
#AUSvENG pic.twitter.com/JsKwfXptMg
— @KingKohlifan (@sdudi_k) November 17, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..