IPL 2023: భువనేశ్వర్‌కు షాక్.? SRH‌కు కొత్త కెప్టెన్‌ అతడేనా.. కేన్ మామ వారసుడిగా యువ బ్యాటర్!

ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పలువురు సీనియర్ ప్లేయర్స్‌ను విడుదల చేసి షాకిచ్చింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్..

IPL 2023: భువనేశ్వర్‌కు షాక్.? SRH‌కు కొత్త కెప్టెన్‌ అతడేనా.. కేన్ మామ వారసుడిగా యువ బ్యాటర్!
Abishek Sharma
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2022 | 6:23 PM

ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పలువురు సీనియర్ ప్లేయర్స్‌ను విడుదల చేసి షాకిచ్చింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్‌తో పాటు మరో 10 మంది ఆటగాళ్లను విడిచిపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. జట్టులో పలు కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమైనట్లు చెప్పకనే చెబుతోంది. మినీ వేలానికి తన పర్స్‌లో రూ. 42.25 కోట్లు అట్టిపెట్టుకున్న హైదరాబాద్ యాజమాన్యం.. ఆక్షన్‌లో పలువురు యువ ప్లేయర్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్ హీరోలపై కూడా కన్నేసిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఎస్‌ఆర్‌హెచ్ విలియమ్సన్‌ను విడిచిపెట్టడంలో జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు భువనేశ్వర్ కుమార్ పగ్గాలు చేపడతాడని టాక్ నడవగా.. ఇప్పుడు లిస్టులోకి కొత్త పేరు వచ్చి చేరింది. అతడెవరో కాదు.. యువ ఆటగాడు అభిషేక్ శర్మ. ఈ యంగ్ ప్లేయర్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడి బ్యాటింగ్ ప్రాక్టిస్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఎస్‌ఆర్‌హెచ్‌ షేర్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ.. వారికి జరిగిన ఓ మంచి విషయం అభిషేక్ శర్మ అద్భుత ఫామ్ కొనసాగించడమే. ఐపీఎల్‌-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ 426 పరుగులతో టాప్ రన్ గెట్టర్‌గా నిలిచాడు.

రిటైన్ ప్లేయర్స్: సమద్, మార్కరమ్, త్రిపాఠి, ఫిలిప్స్, అబిషేక్ శర్మ, జాన్సెన్, సుందర్, ఫారూఖి, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

రిలీజ్ ప్లేయర్స్: విలియమ్సన్, పూరన్, సుచిత్, ప్రియమ్ గార్గ్, సామ్రాత్, షెఫర్డ్, సౌరభ్ దూబే, అబోత్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

మిగిలిన మొత్తం: రూ. 42.25 కోట్లు, ఓవర్సీస్ స్లాట్స్: 4

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్