AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar : తండ్రికి తగ్గ తనయుడు..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండర్ షో

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆల్-రౌండర్‌గా తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా జట్టు తరఫున ఆడుతున్న అర్జున్, మధ్యప్రదేశ్‌పై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ పవర్‌ప్లేలో అద్భుతమైన స్పెల్‌తో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

Arjun Tendulkar : తండ్రికి తగ్గ తనయుడు..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండర్ షో
Arjun Tendulkar
Rakesh
|

Updated on: Dec 02, 2025 | 5:04 PM

Share

Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఆల్-రౌండర్‌గా తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా జట్టు తరఫున ఆడుతున్న అర్జున్, మధ్యప్రదేశ్‌పై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ పవర్‌ప్లేలో అద్భుతమైన స్పెల్‌తో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గోవా జట్టు ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అర్జున్ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో గోవా తమ రెండో విజయాన్ని నమోదు చేసింది.

మధ్యప్రదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు చేసింది. కానీ అర్జున్ టెండూల్కర్ పవర్‌ప్లేలో వేసిన కీలకమైన స్పెల్ కారణంగా వారు మరింత పెద్ద స్కోరు చేయలేకపోయారు. గోవా తరఫున తొలి ఓవర్‌ను వేసిన అర్జున్, ఐదో బంతికే శివాంగ్ కుమార్ను డకౌట్ చేసి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో కీలక వికెట్ అంకుష్ సింగ్ను కూడా అవుట్ చేశాడు.

చివరి ఓవర్లలో కొంచెం ఎక్కువ పరుగులు ఇచ్చినా, అతను వెంకటేష్ అయ్యర్‌ను కేవలం 6 పరుగులకే అవుట్ చేసి తన మూడో వికెట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోవా తరఫున బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ (3 వికెట్లు) చేసింది అర్జున్ టెండూల్కరే.

మధ్యప్రదేశ్ తరఫున హర్‌ప్రీత్ సింగ్ అజేయంగా 80 పరుగులు చేయగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 29 పరుగులు, ఆఖర్లో అంకిత్ వర్మ 4 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని గోవా 18.3 ఓవర్లలో సులభంగా ఛేదించింది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత, అర్జున్ టెండూల్కర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కూడా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌కు రాగానే మూడు ఫోర్లు కొట్టి దూకుడు చూపినా, 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిరుపరేష్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత అభినవ్ తల్వారేజా, కెప్టెన్ సుయష్ ప్రభుదేసాయి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 66 బంతుల్లో 89 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ సుయష్ ప్రభుదేసాయి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 75 పరుగులు చేశాడు. చివర్లో లలిత్ యాదవ్ తో కలిసి కేవలం 27 బంతుల్లో 57 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అర్జున్ టెండూల్కర్ ఆల్-రౌండర్ ప్రదర్శన, ముఖ్యంగా పవర్‌ప్లేలో అతడు చూపిన బౌలింగ్ పర్ఫామెన్స్, గోవా విజయంలో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..