Mumbai Indians: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. కుక్క కాటుకు గురైన యంగ్‌ ప్లేయర్‌..

|

May 16, 2023 | 5:51 PM

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఐపీఎల్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ తరఫున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన అర్జున్.. ప్రారంభంలో అందరి దృష్టి ఆకర్షించాడు.

Mumbai Indians: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. కుక్క కాటుకు గురైన యంగ్‌ ప్లేయర్‌..
Mumbai Indians
Follow us on

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఐపీఎల్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ తరఫున ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన అర్జున్.. ప్రారంభంలో అందరి దృష్టి ఆకర్షించాడు. అయితే, గత కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో లేకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించాడు. అయితే ఈ రోజు ప్లేఆఫ్స్‌ రేసులో ముంబై – లక్నో కీలక మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో ముంబై ఫ్యాన్స్‌ కు షాకింగ్‌ న్యూస్‌ అందింది. ప్రాక్టిస్‌లో భాగంగా సహచరులతో మాట్లాడుతూ.. అర్జున్‌ టెండుల్కర్‌ కుక్క కరిచిందంటూ స్వయంగా వెల్లడించాడు. ఈ వీడియోను లక్నో టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

స్టేడియంలో లక్నో ఆటగాడు యుధ్‌వీర్‌తో అర్జున్‌ మాట్లాడుతూ తనకు కుక్క కరిచిన విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను లక్నో టీ ట్విటర్‌లో హ్యాండిల్‌ లో షేర్‌ చేయగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో.. ఎలా ఉన్నావు అంటూ యుధ్‌వీర్‌ అడగ్గా.. తనను కుక్క కరిచిందని అర్జున్‌ ఎడమ చేతిని చూపించాడు. ఎప్పుడు అని అడగ్గా.. నిన్ననే అంటూ సమాధానమిచ్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ లో ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌ టెండుల్కర్‌ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..