IPL 2022 Closing Ceremony: ముగింపు వేడుకలకు రంగం సిద్ధం.. రెహమాన్‌తోపాటు సందడి చేయనున్న బాలీవుడ్ తారలు..

|

May 28, 2022 | 1:19 PM

ప్రస్తుతం ఐపీఎల్ ఛాంపియన్ కొత్త జట్టా, పాత జట్టా అనేది మ్యాచ్ తర్వాత తేలిపోనుంది. కానీ, అంతకు ముందు ఈ లీగ్ ముగింపు వేడుక జరుగుతుంది. ఇందులో AR రెహమాన్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు పాటలు, డ్యాన్స్‌లతో సందడి చేయనున్నారు.

IPL 2022 Closing Ceremony: ముగింపు వేడుకలకు రంగం సిద్ధం.. రెహమాన్‌తోపాటు సందడి చేయనున్న బాలీవుడ్ తారలు..
Ipl 2022 Closing Ceremony
Follow us on

గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఐపీఎల్ 2022(IPL 2022) ప్రయాణం మే 29 సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ముగియనుంది. టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) మధ్య పోరు జరగనుంది. ఈ జట్లలో ఒక జట్టుకు ఇదే తొలి సీజన్. మరోవైపు, అవతలి జట్టుకు గతంలో ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ ఛాంపియన్ కొత్త జట్టా, పాత జట్టా అనేది మ్యాచ్ తర్వాత తేలిపోనుంది. కానీ, అంతకు ముందు ఈ లీగ్ ముగింపు వేడుక(Closing Ceremony) జరుగుతుంది. ఇందులో AR రెహమాన్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు పాటలు, డ్యాన్స్‌లతో సందడి చేయనున్నారు.

ఐపీఎల్‌లో చివరి ముగింపు వేడుక 2018లో జరిగింది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. బ్రాడ్‌కాస్టర్ ప్రకారం, ఫైనల్ ఈవెంట్ సాయంత్రం 6.25 నుంచి మొదలుకానుంది. కాగా, గుజరాత్, రాజస్థాన్ మధ్య రాత్రి 8 గంటలకు తుది పోరు ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

ముగింపు వేడుకలపై ట్వీట్ చేసిన ఏఆర్ రెహమాన్..

ఈ సందర్భంగా ముగింపు వేడుకలకు హాజరయ్యే బాలీవుడ్ తారలు ట్విట్టర్‌లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఏఆర్ రెహమాన్ కూడా తన ప్రదర్శనకు సంబంధించిన వివరాలు పంచుకుంటూ ట్వీట్ చేశారు.

45 నిమిషాల పాటు ముగింపు వేడుక..

45 నిమిషాల పాటు సాగే ఈ ముగింపు వేడుకలను నిర్వహించేందుకు బీసీసీఐ ఓ ఏజెన్సీకి అప్పగించినట్లు సమాచారం. ముగింపు వేడుకలో భారత క్రికెట్‌ ప్రయాణాన్ని ప్రదర్శించనున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టీవీలో సినిమా ట్రైలర్ లాంచ్ కావడం ఇదే తొలిసారి.

నివేదికల ప్రకారం, ఐపీఎల్ ఫైనల్‌ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి చేరుకోవచ్చని తెలుస్తోంది.