దంచికొట్టిన మాజీ కేంద్రమంత్రి.. పాలిటిక్స్‌లోకి కాకుండా క్రికెట్‌లోకి వస్తే కథ వేరే ఉండు..

|

Dec 16, 2024 | 12:59 PM

Anurag Thakur: లోక్‌సభ స్పీకర్ ఎలెవన్, రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేసి జట్టును 73 పరుగుల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో అనురాగ్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

దంచికొట్టిన మాజీ కేంద్రమంత్రి.. పాలిటిక్స్‌లోకి కాకుండా క్రికెట్‌లోకి వస్తే కథ వేరే ఉండు..
Anurag Thakur
Follow us on

టీబీకి వ్యతిరేకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాగుర్ సెంచరీ చేశారు. లోక్‌సభ స్పీకర్ XI, రాజ్యసభ ఛైర్మన్ XI జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. ఇందులో లోక్‌సభ స్పీకర్ XI 73 పరుగుల తేడాతో రాజ్యసభ ఛైర్మన్ XIని ఓడించింది. ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో లోక్‌సభ స్పీకర్స్ ఎలెవన్ జట్టుకు అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహించగా, రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

అనురాగ్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేశాడు. దీంతో అతని జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి మొత్తం 65 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అనురాగ్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగుల లక్ష్యాన్ని రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్టుకు ఇచ్చింది. ఛైర్మన్స్ XI జట్టు 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు చేశాడు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రివర్ణ బెలూన్‌లను గాలిలోకి వదులుతూ మ్యాచ్‌ను ప్రారంభించగా, మ్యాచ్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్రీడాకారులకు అవార్డులు పంపిణీ చేసి ప్రోత్సహించారు. ఎంపీలంతా ప్రత్యేక రకమైన జెర్సీ ధరించి రంగంలోకి దిగారు. దానిపై టీబీ ఓడిపోతుంది.. భారత్ గెలుస్తుంది అని రాసి ఉంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

బెస్ట్ బౌలర్ దీపేందర్ హుడా, బెస్ట్ ఫీల్డింగ్ నిషికాంత్ దూబే, బెస్ట్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజారుద్దీన్, రామ్ మోహన్ నాయుడు, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గోల్డెన్ డక్, కె. సుధాకర్ సూపర్ సిక్స్ కొట్టారు. మనోజ్ తివారీ సూపర్ క్యాచ్ పట్టాడు. అనురాగ్ ఠాకూర్ అత్యధిక బౌండరీలు కొట్టాడు. చంద్రశేఖర్ ఆజాద్‌కు ఫైటర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ లభించింది.