Anjali Sarvani: జాక్‌పాట్ కొట్టిన తెలుగు తేజం.. వేలంలో కర్నూలు ముద్దుబిడ్డపై కాసుల వర్షం
ముంబై వేదికగా జరుగుతోన్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో తెలుగు తేజం అంజలి శర్వాణీపై కాసుల వర్షం కురిసింది. అండర్-19 ఫార్మాట్‌లో సత్తాచాటి గతేడాది చివర్లో టీమిండియాలోకి అడుగుపెట్టిన అంజలిని రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్.
ముంబై వేదికగా జరుగుతోన్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో తెలుగు తేజం అంజలి శర్వాణీపై కాసుల వర్షం కురిసింది. అండర్-19 ఫార్మాట్‌లో సత్తాచాటి గతేడాది చివర్లో టీమిండియాలోకి అడుగుపెట్టిన అంజలిని రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ఎంపికైంది. కాగా అంజలిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని సొంత గ్రామం. 2012లో భారత U-19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన ఆమె ఆ తర్వాత 2012-13 సీజన్‌లో రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆతర్వాత 2019-20 మధ్య ఆంధ్రా జట్టు తరపున ఆడింది . 2017–18 సీనియర్ మహిళల క్రికెట్ ఇంటర్ జోనల్ త్రీ డే గేమ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ తరఫున ఆడిన అంజలి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఆ ట్యాలెంట్‌తోనే ఇండియా- బి జట్టుకు ఎంపికైంది. 2020లో పాట్నా వేదికగా జరిగిన మహిళల టీ20 క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా- బి జట్టు తరపున ఆడి మంచి ప్రదర్శన కనబర్చింది. అదే ఊపులో టీమిండియాలోకి అడుగుపెట్టింది.
ఇప్పుడు ముంబై వేదికగా జరగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జాక్ పాట్ కొట్టేసింది అంజలి . యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆమెను రూ. 55 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా అంజలీకి అభినందనల వర్షం కురుస్తోంది.
India’s young talent Anjali Sarvani attracts a bid of INR 55 L from UP Warriorz .
UP Warriorz fans, how’s the josh? ?#WPLAuction | #CricketTwitter | #WomensIPL pic.twitter.com/929nL5hoIX
— Female Cricket (@imfemalecricket) February 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..