Video: కంగారులపై కనికరం లేదా బాస్.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లు.. 244 స్ట్రైక్‌రేట్‌తో శివాలెత్తిన డేంజరస్ ప్లేయర్..

AUS vs WI, Andre Russell: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో, చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కంగారులు.. 37 పరుగుల తేడాతో ఓటమిని చవి చూశారు.

Video: కంగారులపై కనికరం లేదా బాస్.. 4 ఫోర్లు, 7 సిక్స్‌లు.. 244 స్ట్రైక్‌రేట్‌తో శివాలెత్తిన డేంజరస్ ప్లేయర్..
Aus Vs Wi 3rd T20i

Updated on: Feb 13, 2024 | 5:24 PM

AUS vs WI Highlights: ఆండ్రీ రస్సెల్ అత్యుత్తమ ఫాంలో ఉన్నప్పుడు, అతని కంటే ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ ప్రపంచంలో మరొకరు ఉండరు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో రస్సెల్ కంగారూ బౌలర్లను చిత్తు చేసి 29 బంతుల్లో 71 పరుగులతో నిలిచాడు. వేగంగా స్కోర్ చేయడంతో కంగారులకు తన భయంకరమైన రూపాన్ని మరోసారి పరిచయం చేశాడు. అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే అతిపెద్ద స్కోరుగా నిలిచింది. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కరీబియన్ ఆల్ రౌండర్ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 244.82 పవర్ ఫుల్ స్ట్రైక్ రేట్ వద్ద నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను టార్గెట్ చేసిన రస్సెల్.. తన చివరి ఓవర్‌లో 28 పరుగులు చేశాడు. 19వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన రస్సెల్ తర్వాత చివరి నాలుగు బంతుల్లో వరుసగా ఒక ఫోర్, మూడు సిక్సర్లు బాదాడు.

వెస్టిండీస్ 220 పరుగులు చేయగా..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. T-20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నంబర్-6, నంబర్-7 బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. రస్సెల్, రూథర్‌ఫోర్డ్ ఆరో వికెట్‌కు T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక భాగస్వామ్యం (139) కూడా చేశారు.

ఆండ్రీ రస్సెల్ తుఫాన్ ఇన్నింగ్స్..

రూథర్‌ఫోర్డ్ 40 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆడమ్ జంపా తన T20 కెరీర్‌లో అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్‌లో నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు.

ఆండ్రీ రస్సెల్ 2012 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో T-20 క్రికెట్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. గత 12 ఏళ్లలో, అతను కంగారూలకు వ్యతిరేకంగా 10 ఇన్నింగ్స్‌లలో 215.96 తుఫాన్ స్ట్రైక్ రేట్, 51.40 బలమైన సగటుతో 257 పరుగులు చేయగలిగాడు. అలాగే, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే 12 మ్యాచుల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై రెండో అత్యధిక పరుగులు (257) చేసిన కరేబియన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నంబర్ వన్ స్థానంలో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 420 పరుగులు చేసిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరు నిలిచింది.

మూడో టీ20లో ఆస్ట్రేలియా ఓటమి..

మూడో, చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కంగారులు.. 37 పరుగుల తేడాతో ఓటమిని చవి చూశారు. అయితే, 2-1 తేడాతో ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..