న్యూఢిల్లీ: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠను తలపించిన మ్యాచ్‌లో చివరకు ఇంగ్లాండు జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది పెదవి విరుస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేసి ఉండాల్సింది కదా అని ప్రశ్నిస్తున్నారు. వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఆ లెక్కన ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి ఉండేది. కానీ బౌండరీ కౌంట్‌ను పరిగణలోకి తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. అయితే ఐసీసీ నియమ, నిబంధనలపై పలవురు మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, క్రికెట్ లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా చేరిపోయాడ.
వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్’ ను పాటించడంపై ఆయన ఫైరయ్యారు. తన ట్వీట్టర్ అకౌంట్‌లో ఐసీసీ అవలంభించిన విధానాన్ని ఆలోచనాత్మక ధోరణిలో విమర్శించారు. ‘నీ వద్ద రెండు వేల రూపాయలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయలు ఉన్నాయ్. అయితే నీ దగ్గర 2000 నోటు ఒకటే ఉంటే, నా దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. మీ లెక్కన నోట్లు ఎక్కువ ఉన్నవాడు..అంటే నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే ధనికుడు అవుతాడా? ఐసీసీ అంటూ సెటైర్లు వేశారు.
T 3227 – आपके पास 2000 रूपये, मेरे पास भी 2000 रुपये,
आपके पास 2000 का एक नोट, मेरे पास 500 के 4 …
कौन ज्यादा अमीर???ICC – जिसके पास 500 के 4 नोट वो ज्यादा रईस.. #Iccrules????
प्रणाम गुरुदेव
Ef~NS— Amitabh Bachchan (@SrBachchan) July 15, 2019