Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?

Ravindra Jadeja: ఛాంపియన్స్ ట్రోపీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నీలో పాల్గొనే జట్లు కూడా తమ సన్నాహాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే, చాలా జట్లు తమ స్వ్కాడ్‌లను ఎంపిక చేయలేదు. టీమిండియా కూడా ఇప్పటి వరకు జట్టును ప్రకటించలేదు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మరో టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?
Team India

Updated on: Jan 11, 2025 | 12:01 PM

Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతడిని వన్డే జట్టు నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం రవీంద్ర జడేజా వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి, త్వరలోనే అతని పరిమిత ఓవర్ల కెరీర్‌కు ముగింపు పలకనుంది. ఛాంపియన్స్ 2025 కోసం భారత జట్టు త్వరలో ప్రకటించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కనిపించడం అనుమానమే. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆందోళన చెందుతోంది.

ఈ జాబితాలో 36 ఏళ్ల రవీంద్ర జడేజా పేరు ముందు వరుసలో ఉంది. 2023 ప్రపంచకప్ తర్వాత జడేజా ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై చర్చ జరిగినట్లు సమాచారం.

త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రవీంద్ర జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కుతుంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడు దూరమైతే.. అతడి వన్డే కెరీర్‌కు ముగింపు పలకవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే, జట్టులో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్లు. ఇప్పుడు యువ ఆటగాడు తనుష్ కొట్యాన్ కూడా భారత జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా దూసుకుపోతున్నాడు. దీంతో భవిష్యత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జడేజాకు దూరమయ్యే అవకాశం ఉంది.

దీనిపై రవీంద్ర జడేజాకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. దీంతో టెస్ట్ జెర్సీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు సమాచారం. దీంతో జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని.. లేదంటే టెస్టుల్లోనే కొనసాగుతాడని అంచనా వేస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.

టీమిండియా తరపున మొత్తం 197 వన్డేలు ఆడిన రవీంద్ర జడేజా.. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌తో వన్డే భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నాడు. ఒకవేళ అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోతే 36 ఏళ్ల ఈ వెటరన్‌ పరిమిత ఓవర్ల కెరీర్‌కు ముగింపు పలకడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..