IND Vs SA: రహానె, పంత్‎కు చిట్కాలు చెప్పిన వినోద్ కాంబ్లీ.. అమ్మమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకున్న మయాంక్

|

Dec 14, 2021 | 7:41 AM

దక్షిణాఫ్రికా టూర్‌కు సన్నద్ధమవుతున్న భారత టెస్ట్ వెటరన్ అజింక్య రహానె, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోమవారం ముంబైలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.

IND Vs SA: రహానె, పంత్‎కు చిట్కాలు చెప్పిన వినోద్ కాంబ్లీ.. అమ్మమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకున్న మయాంక్
Panth
Follow us on

దక్షిణాఫ్రికా టూర్‌కు సన్నద్ధమవుతున్న భారత టెస్ట్ వెటరన్ అజింక్య రహానె, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోమవారం ముంబైలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నుండి సహాయం తీసుకున్నారు. 1993 నుండి 1995 వరకు భారతదేశం తరఫున 17 టెస్టులు ఆడిన కాంబ్లీ, గత రెండేళ్లుగా రెడ్ బాల్ క్రికెట్‌లో పరుగుల కోసం కష్టపడుతున్న రహానెకి కొన్ని బ్యాటింగ్ చిట్కాలు ఇచ్చాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సరీస్‎లో మరో నిరాశపరిచిన రహానె వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు.

ఈ ఏడాది టెస్టుల్లో రహానె సగటు 17 కంటే ఎక్కువగానే ఉన్నాడు. అయితే ప్లేయింగ్ XIలోకి అతనికి చోటు లభిస్తే దక్షిణాఫ్రికాలో పరిస్థితులకు అనుగుణంగా ఆడి కీలక మారే అవకాశం ఉంది. రహానె ముంబైలో కాంబ్లీ, అతని కుమారుడు క్రిస్టియానోతో పాటు భారత ఆటగాడు పంత్‌తో కలిసి శిక్షణ పొందాడు.” రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం అజింక్యా & రిషబ్ శిక్షణలో సహాయం చేయడం ఆనందంగా ఉంది. SA పరిస్థితుల గురించి వారితో కొన్ని విలువైన ఆలోచనలు పంచుకున్నాను. #SAvIND సిరీస్ కోసం వారికి నా శుభాకాంక్షలు.” కాంబ్లీ ట్వీట్ చేశాడు.

ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు తన అమ్మమ్మ నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అతని బెంగళూరు సహచరుడు KL రాహుల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అతను తన అమ్మమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకోకుండా ఎప్పుడూ ఇంటిని విడిచిపెట్టనని వెల్లడించాడు. “ఇది లేకుండా ఏ టూర్ ప్రారంభం కాదు. ప్రతి పోటీకి ముందు అమ్మమ్మ ఆశీర్వాదాలు నాకు అవసరం. వారి ఆశీర్వాదాలు నన్ను నేను నిర్మించుకోవడానికి పునాది. భావోద్వేగాలు, జ్ఞాపకాలు వెలకట్టలేనివి” అని మయాంక్ ట్వీట్ చేశాడు. సోమవారం నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే 3 టెస్టుల సిరీస్ నుంచి తొడ కండరాల గాయంతో రోహిత్ వైదొలిగాడు. ప్రస్తుతానికి ఆ స్థానం ఖాళీగా ఉంది. వైస్ కెప్టెన్‎గా రహానె ఉంటాడా లేక కేఎల్ రాహుల్ ఉంటాడా చూడాల్సి ఉంది.

Read Also.. PAK Vs WI: టీ20లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ ఘన విజయం.. రాణించిన హైదర్ అలీ, రిజ్వాన్..