
Dunith Wellalage, Asalanka: ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ నాలుగో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, లంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా 213 పరుగులకు చేతులెత్తేసింది. దీంతో లంక ముందు 214 పరుగుల టార్గెట్ నిలిచింది. పాకిస్తాన్‌పై రెచ్చిపోయి ఆడిన భారత బ్యాటర్లు.. లంక స్పిన్నర్ల దెబ్బకు తోక ముడిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శ్రీలంక స్పిన్నర్లపై ఇబ్బంది పడుతూ కనిపించారు. భారత జట్టు వికెట్లన్నీ స్పిన్నర్ల చేతుల్లోనే పడ్డాయి. వన్డే చరిత్రలో స్పిన్నర్లపై భారత్ వికెట్లన్నీ పడిపోవడం ఇదే తొలిసారి.
శ్రీలంక జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే 5 వికెట్లు తీయగా, ఆఫ్ స్పిన్నర్ చరిత్ అసలంక నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. మహిష్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 53 పరుగులు చేశాడు. రోహిత్ తన వన్డే కెరీర్‌లో 51వ అర్ధశతకం సాధించాడు. వన్డేల్లో 10 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ 39 పరుగులు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 33 పరుగుల సహకారం అందించారు. అక్షర్, సిరాజ్ చివరి వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
హార్దిక్ పాండ్యా 5 పరుగులు, కేఎల్ రాహుల్ 39 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులు, విరాట్ కోహ్లీ 3 పరుగులు, శుభ్‌మన్ గిల్ 19 పరుగులు చేసిన తర్వాత దునిత్ వెల్లలాగే చేతికి చిక్కి పెవిలియన్ చేరారు.
Sri Lanka’s young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc
— ICC (@ICC) September 12, 2023
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..