
WTC Final 2023, India vs Australia: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే బ్యాట్‌తో 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా తన తొలి ఇన్నింగ్స్ స్కోరు 296 పరుగులకు చేరుకోవడంతోపాటు ఫాలోఆన్ ప్రమాదాన్ని కూడా తప్పించుకుంది. బాధపడుతూనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రహానే వేలికి బంతి తగిలింది. ఆ తర్వాత అతను నిరంతరం నొప్పితో బాధపడుతున్నప్పటికీ బ్యాటింగ్ కొనసాగించాడు.
ఈ క్రమంలో ఆయన భార్య రాధిక ధోపావ్కర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి, రహానే స్ఫూర్తిని ప్రశంసించింది. రహానే భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పోస్ట్ చేస్తూ.. మీ వేలికి దెబ్బ తగిలి నొప్పి పెడుతున్నా.. మీ మైండ్‌సెట్ చెక్కుచెదరకుండా ఉంది. స్కాన్ చేసుకోకుండానే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. నిస్వార్థత, సంకల్పంతో బ్యాటింగ్ కొనసాగించారు’ అంటూ చెప్పుకొచ్చింది.
తిరుగులేని నిబద్ధతతో మా అందరికీ స్ఫూర్తినిచ్చారంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎంతోమంది తమ కామెంట్లతో రహానేను ప్రశంసించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అజింక్య రహానే తన టెస్టు కెరీర్‌లో 5000 పరుగులు కూడా పూర్తి చేశాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి మూడో రోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నానని, దాని వల్ల ప్రయోజనం పొందానని చెప్పుకొచ్చాడు. రహానే తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌కి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరు 7వ వికెట్‌కు 109 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..