CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి అద్భుతం చేసిన ఆఫ్ఘాన్ జట్టు.. అదేంటంటే?
ఆఫ్ఘనిస్తాన్ ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్ఘాన్ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు ప్రదర్శన ఇలాగే కొనసాగితే, జట్టు సెమీ-ఫైనల్‌కు కూడా చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ టాప్ 4 బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. బాబర్ అజామ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

Afghanistan: భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 (CWC 2023) లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈసారి చాలా పెద్ద జట్ల ప్రదర్శన నిరాశపరిచింది. అయితే కొన్ని జట్లు ఆశ్చర్యకరమైన పని చేశాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan Cricket Team) పేరు కూడా ఉంది. సోమవారం, అక్టోబర్ 30న ప్రపంచ కప్‌లో తన మూడవ విజయాన్ని నమోదు చేసిన అఫ్ఘనిస్తాన్ జట్టు.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంకను 28 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ చేయని ఘనతను సాధించింది.
పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన అఫ్గాన్ జట్టుకు ఆరంభం చెడిపోవడంతో ఆ జట్టు స్కోరు 0 వద్ద ఇన్నింగ్స్ నాలుగో బంతికి తుఫాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ వికెట్ కోల్పోయింది.
ఇక్కడి నుంచి రహమత్ షా (62) ఇబ్రహీం జద్రాన్ (39)తో కలిసి స్కోరు 70 దాటగా, మూడో వికెట్‌కు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (58*)తో కలిసి అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 131కు తీసుకెళ్లాడు. దీని తర్వాత షాహిదీకి మద్దతుగా వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ 63 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి 46వ ఓవర్లో జట్టుకు విజయాన్ని అందించాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి రెండు వరుస విజయాలు నమోదు..
View this post on Instagram
శ్రీలంకను ఓడించి వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ తొలిసారి వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఘనత సాధించింది. అంతకుముందు, గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన ఆఫ్ఘాన్.. వన్డే ఫార్మాట్‌లో వారిపై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ టాప్ 4 బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. బాబర్ అజామ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
ఆఫ్ఘనిస్తాన్ ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్ఘాన్ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు ప్రదర్శన ఇలాగే కొనసాగితే, జట్టు సెమీ-ఫైనల్‌కు కూడా చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్వీన్, ఫూల్-హకీ.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహిష్ థిక్షన్, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..