Afghanistan Crickete: ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్లు ఆక్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ భవిష్యత్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాలిబాన్లు కాబూల్ పట్టణంలో ప్రవేశించినప్పటి నుంచి చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుందనే దానిపై ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అదే సమయంలో ఆ దేశ క్రీడాకారుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఆఫ్గాన్ క్రికెట్ జట్టు తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించింది. అయితే తాలిబాన్ క్రికెట్ కార్యకలాపాలకు హాని కలిగించదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ చెబుతున్నా ఈ ఫొటో మాత్రం పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) మాజీ మీడియా మేనేజర్, జర్నలిస్ట్ ఇబ్రహీమ్ మొమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో తాలిబాన్లు కూర్చుని ఉంటారు. వారితో పాటు ఆఫ్ఘనిస్తాన్ మాజీ బౌలర్ అబ్దుల్లా మజారీ కూడా ఉన్నాడని ఇబ్రహీం పేర్కొన్నాడు. మజారీ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ కోసం 2 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. తాలిబాన్లు దాదాపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ని ఆక్రమించారు. ఇటీవల వారు ఎలాంటి విద్యా, సాంస్కృతిక లేదా క్రీడా కార్యకలాపాలను నిషేధించబోమని పేర్కొన్నారు. కానీ ఈ చిత్రం పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కూడా తాలిబాన్ పాలనలో ఉంటుందని భయపడుతున్నారు. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ వంటి దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు ఇప్పటికే దేశంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాలిబాన్లు క్రికెట్‌ని దెబ్బతీయరని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు CEO హమీద్ షిన్వారీ పేర్కొన్నారు.”తాలిబాన్‌లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వారు మొదటి నుంచి క్రికెట్‌కి మద్దతు ఇచ్చారు. వారు మా కార్యకలాపాలలో జోక్యం చేసుకోరు. ఇప్పటివరకు నేను ఎలాంటి జోక్యాన్ని చూడలేదు. అయితే మా క్రికెట్ పురోగతి సాధించడానికి మద్దతు కోసం మాత్రం ఆశిస్తున్నాను. తదుపరి నోటీసు వచ్చేవరకు నేను సీఈఓగా ఉంటాను. తాలిబాన్ల కాలంలో క్రికెట్ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చని” అన్నారు.
Islamic Emirates Taliban have arrived in Afghanistan Cricket Board headquarters in Kabul accompanying by former national cricketer #AbdullahMazari too.#AFGvPAK pic.twitter.com/8uc7ix00I9
— M.ibrahim Momand (@IbrahimReporter) August 19, 2021