IPl 2022: చాలామంది లాగే నాక్కూడా అతని కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Mar 23, 2022 | 7:00 AM

IPl 2022: ఒత్తిడి, ఆందోళన, పిచ్‌ లాంటి అంశాలు తనపై ప్రభావం చూపవని, వీటిపై దృష్టి సారించే బదులు మంచి ప్రదర్శన, నైపుణ్యాలపై దృష్టి సారిస్తానని అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) తెలిపాడు

IPl 2022: చాలామంది లాగే నాక్కూడా అతని కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rashid Khan
Follow us on

IPl 2022: ఒత్తిడి, ఆందోళన, పిచ్‌ లాంటి అంశాలు తనపై ప్రభావం చూపవని, వీటిపై దృష్టి సారించే బదులు మంచి ప్రదర్శన, నైపుణ్యాలపై దృష్టి సారిస్తానని అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) తెలిపాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అఫ్గాన్‌కు పలు విజయాలు అందించిన ఈ లెగ్‌స్పిన్నర్‌ శనివారం (మార్చి26) నుంచి ప్రారంభమయ్యే IPL-2022 (IPl 2022) లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు . గత సీజన్‌ వరకు అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. కాగా ఐపీఎల్‌కు ముందు ఓ వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్న రషీద్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది తన కల అని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా ఐపీఎల్‌ లో తన ప్రయాణం, ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ధోని కెప్టెన్సీలో..

‘ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లు ముంబైలోనే జరుగుతాయి. ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు సహాయం అందుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను దుబాయ్‌లో చాలా ఆడాను. ముంబై పిచ్ నుంచి స్పిన్నర్లు టర్న్, బౌన్స్ పొందుతారు కానీ నేను పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించను. జట్టుకు ఏ విధంగా ఉపయోగపడాలనేదానిపైనే పూర్తిగా దృష్టి సారిస్తాను. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన IPL జట్టు గురించి అడగ్గా.. ‘ చాలామంది క్రికెటర్ల లాగే నాకు కూడా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఆడాలనుకుంటున్నాను. అది నా కల కూడా. అయితే నేను ప్రస్తుతం గుజరాత్ కోసం ఆడుతున్నాను కాబట్టి ఇది నా డ్రీమ్ టీమ్. జట్టును గెలిపించేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. గుజరాత్ జెర్సీ ధరించబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మ్యాచ్‌ల్లో విజయాలు, ఓటములు సాధారణం. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన ఆట గాడితప్పుతుంది. ఓ ఆటగాడిగా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తాను. మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ఐపీఎల్ ఒక పెద్ద వేదిక. ఇక్కడ రాణించాలంటే మానసికంగా బలంగా ఉండాలి. నా అనుభవాన్ని నా జట్టు సభ్యులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చాడు రషీద్‌ ఖాన్‌.

Also Read:ద్రాక్ష తీసుకుంటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

Central Silk Board Jobs: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌ ఆధారంగా ఎంపిక..

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!