42 ఫోర్లు, 18 సిక్సర్లతో 458 పరుగులు, 11 వికెట్లు.. ప్రత్యర్ధులను రఫ్ఫాడించిన ఆల్‌రౌండర్.. కట్ చేస్తే!

|

Feb 01, 2023 | 8:22 AM

ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23లో అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ, ఆ జట్టు ఓపెనర్..

42 ఫోర్లు, 18 సిక్సర్లతో 458 పరుగులు, 11 వికెట్లు.. ప్రత్యర్ధులను రఫ్ఫాడించిన ఆల్‌రౌండర్.. కట్ చేస్తే!
Matthew Short
Follow us on

ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022-23లో అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ మాత్రం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అటు బ్యాట్.. ఇటు బంతితో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

టోర్నీలో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన మాథ్యూ షార్ట్ 144 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 458 పరుగులు చేశాడు. 35.23 సగటుతో 18 సిక్సర్లు, 42 ఫోర్లు సాయంతో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అటు మాథ్యూ షార్ట్ బంతితోనూ తన సత్తా చాటాడు. తన ఆఫ్ స్పిన్‌తో 7.13 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అడిలైడ్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం అయిదింటిలో మాత్రమే గెలవగలిగింది. కాగా,  ఇదే జట్టు విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ టోర్నమెంట్ మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడి 416 పరుగులు చేశాడు. 40 ఫోర్లు, 14 సిక్సర్లతో 3 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..