చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఐపీఎల్ 2023కి ముందు విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటిని కొట్టిపారేస్తూ తాజాగా ఫ్రాంచైజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జడేజాను విడిచిపెట్టడానికి ఇష్టపడదని వార్తలు వినిపిస్తున్నాయి. IPL 2022 తర్వాత, జడేజా, సీఎస్‌కే మధ్య సంబంధాలు క్షీణించాయి. అలాంటి నివేదికలు తెరపైకి వస్తున్నాయి. అయితే, ఫ్రాంచైజీ వైపు నుంచి అంతా బాగానే ఉందని చెన్నై వైపు నుంచి స్పష్టంగానే ఉందని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జరగనున్న మినీ వేలానికి ముందు చెన్నై ఏ ఆటగాళ్లను విడుదల చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022 మెగా వేలంలో రూ.3.60 కోట్ల ధరకు జట్టులో చేర్చుకుంది. జోర్డాన్ IPL 2022లో చెన్నై తరపున మొత్తం 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో అతని ఎకానమీ రేటు కూడా 10 పైన ఉంది. ఈ ఏడాది మినీ వేలానికి ముందే CSK అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
2022 మెగా వేలంలో కివీ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.90 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2022లో, అతను చెన్నై తరపున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందులో అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఈసారి మినీ వేలానికి ముందే అతడిని విడుదల చేయాలని సీఎస్‌కే చూస్తోంది.
2022 మెగా వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్‌ను రూ. 20 లక్షల బేస్ ధరకు CSK కొనుగోలు చేసింది. గత ఏడాది చెన్నై తరపున నారాయణ్ మొత్తం 2 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 40 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరగనున్న మినీ వేలానికి ముందే నారాయణ్ జగదీషన్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో CSK ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలం 2022లో రూ. 1.9 కోట్లకు తమ జట్టులోకి తీసుకున్నారు. అతను 2022లో చెన్నై తరపున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. అయితే అతని ఎకానమీ (6.84) బాగానే ఉంది. అయితే ఈసారి విడుదల చేయాలనే ఆలోచనలో చెన్నై ఉందని తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..