ICC World Cup: వరల్డ్‌ కప్‌ వేడుకకు సర్వం సిద్ధం.. టీమిండియా తుది జట్టు ఇదేనంటోన్న గూగుల్‌ బార్డ్‌

వరల్డ్ కప్‌ చరిత్రలో తొలిసారి భారత్‌ ఒంటరిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం తొలిసారి. అయితే అంతకు ముందు 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కలిసి ప్రపంచకప్‌ను నిర్వహించిన విషయం విధితమే. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఇప్పుడు అందిర దృష్టి టీమిండియా తుది జట్టుపై పడింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుంది..? తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్న...

ICC World Cup: వరల్డ్‌ కప్‌ వేడుకకు సర్వం సిద్ధం.. టీమిండియా తుది జట్టు ఇదేనంటోన్న గూగుల్‌ బార్డ్‌
World Cup 2023

Updated on: Oct 05, 2023 | 8:33 AM

క్రికెట్ వరల్డ్‌ కప్‌కు సర్వం సిద్ధమైంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. అక్టోబర్ 5వ తేదీ (నేటి) నుంచి పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ 2023 ప్రారంభమవుతోన్న విషయం తెలిసిందే. నవంబర్‌ 19వ తేదీ వరకు వరల్డ్‌ కప్‌ సమరం కొనసాగనుంది. ఇప్పటి వరుక 12 వరల్డ్‌కప్‌లు నిర్వహించగా ఇది 13వ ప్రపంచకప్‌ జరుగుతోంది.

వరల్డ్ కప్‌ చరిత్రలో తొలిసారి భారత్‌ ఒంటరిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం తొలిసారి. అయితే అంతకు ముందు 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కలిసి ప్రపంచకప్‌ను నిర్వహించిన విషయం విధితమే. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఇప్పుడు అందిర దృష్టి టీమిండియా తుది జట్టుపై పడింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుంది..? తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చాట్‌ బాట్‌ గూగుల్‌ బార్డ్‌ను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

గూగుల్‌ బార్డ్‌ను ఈసారి వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెట్‌ ప్లేయింగ్ ఎలెవన్‌ ఏంటి అడిగితే ఇచ్చిన సమాధానం ఏంటంటే. ఈసారి ప్లేయింట్ ఎలెవన్‌లో రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి ఉంటారని గూగుల్ బార్డ్ తెలిపింది. ఇక సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌లకు గూగుల్ బార్డ్‌ తుది జట్టులో చోటు దక్కదని తెలిపింది.

ఆక ప్లేయింగ్ 11 జాబితాలో ఈ ఆటగాళ్లకే ఎందుకు స్థానం కల్పించారన్న దానికి కూడా గూగుల్ బార్డ్ సమాధానం ఇచ్చింది. తాను ఎంపిక చేసిన జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగాల్లో సమానంగా ఉందని అందుకే ఈ ప్లేయర్స్‌ బెస్ట్ 11 ఆటగాళ్లుగా గూగుల్ బార్డ్‌ అభివర్ణించింది. అటు ఎక్స్‌పీరియన్స్‌, ఇటు యంగ్ ప్లేయర్స్‌తో టీమిండియా ఈసారి ప్రపంచకప్‌ గెలిచేందుకు అవసరమైన సత్తా ఉందని గూగుల్‌ బార్డ్‌ తెలిపింది. మరి గూగుల్ బార్డ్‌ జోష్యం ఏమేరకు నిజం అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఈరోజు (గురువారం) ఇంగ్లండ్‌, న్యూజీలాండ్‌ల మధ్య జరనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇక భారత్‌ విషయానికొస్తే.. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా వరల్డ్‌ కప్‌ 2023లో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక అక్టోబర్ 14వ తేదీన క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆతృతతగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..