IPL 2025 Auction: ఆ నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయండి..RCB కి సూచించిన ABD
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగనుంది. ఈ మెగా వేలంలో ఆర్సీబీ జట్టు నలుగురు కీలక ప్లేయర్లను దక్కించుకోవాలని ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సూచించారు. ఆర్సీబీకి ప్రపంచ స్థాయి స్పిన్నర్లయిన యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ అవసరమన్న ఏబీడి.. కగిసో రబాడా, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లను కొనుగోలు చేయాలని అన్నారు. ఈ ఆటగాళ్లతో జట్టు బలపడతుందని, వారి కోసం జట్టు పర్సులో ఎక్కువ డబ్బు కేటాయించేలా ప్రణాళికలు రచించాలని డివిలియర్స్ సూచించారు.

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మెగా వేలానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఇప్పటికే అట్టిపెట్టుకున్నాయి. ఐపీఎల్ మొదలై 17 సీజన్లు ముగిసిన ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు కప్పు కొట్టలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైన తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్‌లను అట్టిపెట్టుకుంది.
ఆర్సీబీ జట్టు కప్పు కొట్టకపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయాలే అని అభిమానులు ఎప్పుడు అసంతృప్తి వెళ్లగక్కుతుంటారు. ఆర్సీబీ యాజమాన్యం ఏ ఆటగాడిపై నమ్మకం ఉంచదని అందుకే ఆ జట్టులో ప్లేయర్లు నిలకడ లేమితో సతమతమవుతారని అభిమానుల వాదన. అయితే సారి ఆర్సీబీ ఖచ్చితంగా ఓ నలుగురు ఆటగాళ్లు వేలంలో దక్కించుకోవాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సూచించాడు. IPL లో ఆర్సీబీ తరఫున 11 ఎడిషన్లలో జట్టుకు సేవలు అందించిన AB డివిలియర్స్ ఇప్పుడు రాబోయే IPL వేలంలో ఓ నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాలని సూచించాడు.
ప్రస్థుతానికి ఆర్సీబీ ఫ్రాంచైజీ పర్స్‌లో 83 కోట్లు (రెండవ అత్యధిక డబ్బు ఉన్న ప్రాంచైజీ) కలిగి ఉన్నందున, బెంగళూరు తమకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది. IPL ప్లేయర్ల మెగా వేలంలో ప్రపంచ స్థాయి లెగ్ స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడలతో పాటు భువనేశ్వర్ కుమార్‌లను కొనుగోలు చేయాలని సలహా ఇచ్చాడు.
ఆర్‌సీబీ జట్టుకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అవసరమని నేను భావిస్తున్నాను.. కాబట్టి యుజువేంద్ర చాహల్‌ని వేలంలో దక్కించుకోవాలన్నాడు. అంతే కాదు అశ్విన్‌కు చాలా అనుభవం ఉందని అతను బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ ద్వారా జట్టుకు ఉపయోగపడగలడని అన్నాడు. రాజస్థాన్ జట్టులోని ఈ ఇద్దరు స్పిన్ ద్వయం ఎంత ప్రమాదకరంగా ఉన్నారో ఆలోచించాలన్నాడు. ఇక అశ్విన్, చాహల్ తర్వాత పేసర్ కగిసో రబడాను కొనుగోలు చేయాలన్నాడు. రబడ ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడే అన్నాడు.
RCB వేలంలో కొనుగోలు చేయడానికి నేను ఇష్టపడే బౌలర్లు చాహల్, అశ్విన్, రబడ మరియు భువనేశ్వర్ కుమార్. మీ పర్సులో ఎక్కువ భాగం ఈ నలుగురి కోసం రిజర్వ్ చేయండి. మీకు రబాడ లభించకపోతే, మహ్మద్ షమీ లేదా అర్ష్‌దీప్ సింగ్‌ను కొనుగోలు చేయండి” అని RCB ఫ్రాంచైజీ కి ABD సూచించాడు.



