83 Trailer: రణవీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ ’83’ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచకప్‌ను గెలుచుకోవడం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ ట్రైలర్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయానికి దారితీసిన అనేక ఐకానిక్ క్షణాలను చూపించనున్నారు. రణ్‌వీర్ ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ట్రైలర్‌లో ఒక చిన్న పిల్లవాడు సంబరాలు చేసుకోవడంపై అంతా దృష్టి సారించాడు. ఈ పిల్లాడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ బాలుడు ఎవరంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడుస్తోంది. టీమిండియా దిగ్గజ బ్యాట్సమెన్ సచిన్ టెండూల్కర్ అంటూ కొంతమంది పేర్కొంటున్నారు. పోలిక ఉన్నట్లు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా ‘మాస్టర్ బ్లాస్టర్’ ఫొటోనేనా అని అభిమానులు ఊహాగానాలు ప్రారంభించగా, చిత్ర బృందంలోని సభ్యుడు వారికి సమాధానమిచ్చాడు.
ఈ మేరకు ట్రైలర్ నుంచి ఆ పిల్లాడి ప్రత్యేక ఫ్రేమ్‌ను పంచుకుంటూ అసలు విషయం వెల్లడించారు. సినీ విమర్శకుడు ఉదయ్ భాటియా ఆ పిల్లవాడు సచిన్ టెండూల్కరేనా అని ట్వీట్‌లో ప్రశ్నించారు. దీనికి చిత్ర ఎడిటర్ నితిన్ బైద్ సమాధానమిస్తూ ఆ ట్రైలర్‌లో ఉన్నది నిజంగా యువ టెండూల్కర్ అని ధృవీకరించారు. దీంతో నెటిజన్లు సంతోషంతో కామెంట్లు చేస్తూ చిన్ననాటి సచిన్ ఎంతో బాగున్నాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
గత ఏడాది జూన్‌లో టెండూల్కర్ 1983 ప్రపంచ కప్ విజయం 37వ వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ చేశాడు. ఆ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశాడు. “#WorldCup1983 ఫైనల్ చాలామందితో పాటు నా జీవితంలోనూ ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటికీ నా స్నేహితులతో కలిసి ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంటుంటాను. బీఎస్ సంధు ఓల్డ్ డెలివరీ నుంచి గ్రీనిడ్జ్, కపిల్ పాజీ క్యాచ్ వరకు అన్ని విషయాలను నేను మర్చిపోలేదు. మేం ఒక్కో వికెట్ పడినప్పుడు ఎగురుతూ సంబరాలు చేసుకున్నాం’ అని రాసుకొచ్చాడు.
ఈ సినిమాల రణ్‌వీర్ భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌గా నటిస్తున్నాడు. అలాగే ’83’ చిత్రంలో సునీల్ గవాస్కర్‌గా తాహిర్ రాజ్ భాసిన్, మొహిందర్ అమర్‌నాథ్‌గా సాకిబ్ సలీమ్, రవిశాస్త్రిగా ధైర్య కర్వా, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, బల్వీందర్ సంధుగా అమ్మీ విర్క్, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ ఖట్టర్, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా ఆదినాథ్ కొఠారే, కీర్తి ఆజాద్‌గా దినకర్ శర్మ, యశ్‌పాల్ శర్మగా జతిన్ సర్నా, రోజర్ బిన్నీగా నిశాంత్ దహియా, సునీల్ వాల్సన్‌గా ఆర్ బద్రీ. అదనంగా, పంకజ్ త్రిపాఠి జట్టు మేనేజర్ పీఆర్ మాన్ సింగ్‌గా నటించాడు. కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ పాత్రలో దీపికా పదుకొణె నటిస్తోంది.
Yes
— nitin (@nitin_baid) November 30, 2021
Also Read: MS Dhoni: ధోని కొత్త బైక్ చూశారా.. రూపురేఖలు మారిన యమహా ఆర్‌డీ 350..!
IND VS SA: భారత ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా హామీ.. పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?