Team India: ధోని నుంచి సచిన్ వరకు.. ఈ 5 భారీ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్.. అవేంటంటే?
5 Records May Broken in IND vs ENG ODI Series: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనేక భారీ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

Team India
5 Records May Broken in IND vs ENG ODI Series: ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలైంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ విదర్భ మైదానంలో జరుగుతోంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీం ఇండియా తిరిగి వచ్చింది. ఆ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ క్రమంలో 5 భారీ రికార్డులను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగలరు.
- రంజీ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో 14,000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీకి 94 పరుగులు అవసరం. విరాట్ ఇప్పటివరకు 283 ఇన్నింగ్స్‌లు ఆడాడు. సచిన్ 350 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగులు చేశాడు.
- రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేయగలడు. రోహిత్ ప్రస్తుతం 10,866 పరుగులు సాధించాడు. రోహిత్ కి ఇంకా 134 పరుగులు అవసరం. సచిన్ 276 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగులు చేశాడు. రోహిత్ 257 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
- ఇంగ్లాండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీకి గొప్ప అవకాశం ఉంది. ధోని 48 మ్యాచ్‌ల్లో 1546 పరుగులు చేశాడు. విరాట్ 36 మ్యాచ్‌ల్లో 1340 పరుగులు చేశాడు. విరాట్ ఇంకా 207 పరుగులు మాత్రమే చేయాలి.
- రవీంద్ర జడేజా జేమ్స్ ఆండర్సన్ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్: భారత్-ఇంగ్లాండ్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అండర్సన్ పేరిట ఉంది (40). అతను 31 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. జడేజా 39 వికెట్లు పడగొట్టాడు. అతను రెండవ స్థానంలో ఉన్నాడు.
- భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పై 3 వన్డే సెంచరీలు సాధించాడు. రోహిత్ పేరులో 2 ఉన్నాయి. కాబట్టి, వన్డే సెంచరీని ఎవరు బద్దలు కొడతారో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








