ODI Records: 46 సిక్సర్లు, 64 ఫోర్లు.. వన్డే క్రికెట్ హిస్టరీలోనే డేంజరస్ మ్యాచ్.. బౌలర్లకు బ్లడ్ బాతే భయ్యో
ODI Cricket History: ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో, రెండు జట్ల బ్యాట్స్‌మెన్ కలిసి ఒకే వన్డే మ్యాచ్‌లో 46 సిక్సర్లు, 64 ఫోర్లు కొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏ మ్యాచ్‌లోనైనా ఒకే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

ODI Cricket History: ప్రతిరోజూ వన్డే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. మరొకొన్ని బద్దలవుతూనే ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో, బౌలర్ల పరిస్థితి దిగజారిన మ్యాచ్‌లు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఒక మ్యాచ్ ఫిబ్రవరి 27, 2019న ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ వన్డే క్రికెట్‌లో కొంతమంది ఊహించని విధంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో, రెండు జట్ల బ్యాట్స్‌మెన్ కలిసి ఒకే వన్డే మ్యాచ్‌లో 46 సిక్సర్లు, 64 ఫోర్లు కొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏ మ్యాచ్‌లోనైనా ఒకే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
బట్లర్ సెంచరీ..
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 418 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తరపున జోస్ బట్లర్ 77 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, బట్లర్ 13 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు, అప్పటి జట్టు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ కూడా 103 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
క్రిస్ గేల్ విధ్వంసక ఇన్నింగ్స్..
ఇంగ్లాండ్ చేసిన 419 పరుగులకు ప్రతిస్పందనగా బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు కూడా అద్భుతంగా రాణించింది. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మాన్ క్రిస్ గేల్ తన బ్యాట్ తో తనను యూనివర్స్ బాస్ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు. అతను 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. డారెన్ బ్రావో కూడా ఆ ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ కూడా ఫోర్లు, సిక్సర్లతో నిండి ఉంది.
ప్రపంచ రికార్డు నమోదు..
రెండు జట్ల బ్యాటర్స్ తమ తుఫాన్ ఇన్నింగ్స్ ద్వారా ఒకే వన్డే మ్యాచ్‌లో 46 సిక్సర్లు, 64 ఫోర్లు కొట్టారు. ఇది ఒకే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అప్పటి నుంచి వన్డే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన రికార్డు నవంబర్ 2, 2013న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఈ మ్యాచ్‌లో, రెండు జట్లు 38 సిక్సర్లు, 59 ఫోర్లు బాదాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







