
2025 ఛాంపియన్స్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టుకు, ప్రత్యేకంగా రోహిత్ శర్మకు ఒక కీలక టోర్నమెంట్. ఇది రోహిత్‌కు 17వ ఐసిసి ఈవెంట్ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ బుధవారం నుంచి పాకిస్తాన్‌లో ప్రారంభమవుతోంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శుభ్‌మాన్ గిల్ తాము ఇప్పటివరకు ఆడిన ఐసిసి ఈవెంట్ల గురించి మాట్లాడుకున్న వీడియోను BCCI ఇటీవల విడుదల చేసింది. అందులో రోహిత్ తన 17 ఐసిసి టోర్నమెంట్ల ప్రస్తావన చేయగా, శుభ్‌మాన్ గిల్ ఆశ్చర్యానికి గురయ్యాడు.
రోహిత్ మొదటి ఐసిసి టోర్నమెంట్ 2007లోని టి20 వరల్డ్ కప్ అప్పటి నుంచి 9 టి20 వరల్డ్ కప్‌లు, 3 వన్డే వరల్డ్ కప్‌లు, 2 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో పాల్గొన్నాడు. మరోవైపు, గిల్ 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టి20 వరల్డ్ కప్, 2 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌తో కలిపి ఐదు ఐసిసి ఈవెంట్లలో మాత్రమే పాల్గొన్నాడు. జడేజా చెప్పినట్లుగా, విరాట్ కోహ్లీ దీనికంటే ఎక్కువ ఐసిసి ఈవెంట్లలో పాల్గొనివుంటాడని ఊహించారు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా మారింది. వారి అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, ఈ టోర్నమెంట్ గెలవడం ద్వారా వారు ఘనంగా వీడ్కోలు తీసుకోవచ్చు. గత పదహారేళ్లుగా భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, తాము భారత జట్టును మరోసారి విజయపథంలోకి నడిపించగలరా అనే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది.
ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిన తర్వాత భారత జట్టు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆసక్తికరంగా మారింది. శుభ్‌మాన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు ప్రధాన భాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించలేకపోతే, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంపై విమర్శలు ఎదురయ్యే అవకాశముంది.
చివరగా, 2013లో ధోని కెప్టెన్సీలో గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, భారత్ మరోసారి 50 ఓవర్ల ఐసిసి ట్రోఫీ గెలవాలన్న తపనతో ఉంది. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాకుండా, భారత క్రికెట్ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచే కీలకమైన క్షణం.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
🚘 When #RohitSharma and #RavindraJadeja dive into numbers on the move…
✍️ Who set the pace with the fastest autographs?
📸 Who stole the spotlight in the quickest headshot session?
Get an exclusive look behind the scenes of #TeamIndia’s #ChampionsTrophy Content Day! 🎥🇮🇳… pic.twitter.com/N6L4ycbJLV
— Indian Cricket Team (@incricketteam) February 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..