
Asia Cup 2025 : ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌ను గెలవడానికి భారత జట్టు చాలా స్ట్రాంగ్ పోటీదారుగా ఉంది. అయితే, ఛాంపియన్‌గా మారడం అంత ఈజీ కాదు. భారత జట్టుకు ఒకటి కాదు, మొత్తం 11 మంది ఆటగాళ్ల నుండి ముప్పు పొంచి ఉంది. ఈ రిపోర్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయగల 11 మంది స్పిన్ బౌలర్ల గురించి తెలుసుకుందాం. అభిషేక్ శర్మ అయినా, శుభమన్ గిల్ అయినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయినా, ప్రతి టీమిండియా ప్లేయర్‌కు వీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.
భారత్‌కు ప్రమాదకరమైన 11 మంది స్పిన్నర్లు
1. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఆసియా కప్‌లో భారత జట్టుకు అతిపెద్ద ముప్పు అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ నుండి ఉంది. గత కొంతకాలంగా రషీద్ మంచి ఫామ్‌లో లేనప్పటికీ, ఇప్పుడు అతని ఆట మళ్లీ మొదలైంది. టీ20 ట్రై సిరీస్‌లో 4 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి ఇది నిరూపించుకున్నాడు.
2. నూర్ అహ్మద్ (అఫ్గానిస్తాన్)
రషీద్ ఖాన్ శిష్యుడిగా పిలిచే నూర్ అహ్మద్ భారత జట్టుకు రెండో పెద్ద ముప్పు. ఈ ఆటగాడు తన వేగవంతమైన స్పిన్‌కు ప్రసిద్ధి చెందాడు. టీ20 ట్రై సిరీస్‌లో నూర్ అహ్మద్ 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీశాడు.
3. మహమ్మద్ నవాజ్ (పాకిస్థాన్)
ఆసియా కప్‌లో భారత జట్టుకు మూడో అతిపెద్ద ముప్పు మహమ్మద్ నవాజ్. పాకిస్థాన్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ట్రై సిరీస్ ఫైనల్‌లో అఫ్గానిస్తాన్‌ను ఓడించాడు. నవాజ్ 5 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు. ఫైనల్‌లో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.
4. అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్)
భారత జట్టుకు నాలుగో అతిపెద్ద ముప్పు పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఈ ఆటగాడు ట్రై సిరీస్‌లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. అబ్రార్ బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలడు.
5. సూఫియాన్ ముఖీమ్ (పాకిస్థాన్)
భారత జట్టుకు ఐదో, కొత్త ముప్పు సూఫియాన్ ముఖీమ్. ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ భారత్‌కు వ్యతిరేకంగా మొదటిసారి ఆడవచ్చు. ట్రై సిరీస్‌లో 4 మ్యాచ్‌లలో 4 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ, అతని కెపాసిటీ చాలా ఎక్కువ. అతనికి కుల్‌దీప్ యాదవ్ లాంటి నైపుణ్యం ఉంది.
6. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్)
భారత జట్టుకు మరో స్పిన్నర్ పెద్ద ముప్పుగా మారవచ్చు. అతను మహమ్మద్ నబీ. ఈ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ భారత జట్టుకు గతంలో చాలా సమస్యలు సృష్టించాడు. నబీ కూడా ట్రై సిరీస్‌లో 4 మ్యాచ్‌లలో 4 వికెట్లు తీశాడు.
7. హైదర్ అలీ (యూఏఈ)
పాకిస్థాన్, అఫ్గానిస్తాన్‌లే కాదు, యూఏఈకి చెందిన ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా భారత జట్టుకు సమస్యలు సృష్టించవచ్చు. హైదర్ అలీ టీ20 ట్రై సిరీస్‌లో 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు.
8. మహమ్మద్ అల్లాహ్ గజన్ఫర్ (అఫ్గానిస్తాన్)
మహమ్మద్ అల్లాహ్ గజన్ఫర్ అఫ్గానిస్తాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్. అతను ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, 11 వన్డేలలో రెండుసార్లు ఐదు వికెట్లు తీయగలిగాడు.
శ్రీలంక నుండి మూడు డేంజర్లు
ఈ ఎనిమిది మంది కాకుండా, ఇంకా ముగ్గురు స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టగలరు. వారు శ్రీలంకకు చెందిన లెగ్ స్పిన్నర్లు వానిందు హసరంగా, వెల్లాలగే, మహీష్ తీక్షణ. హసరంగా, వెల్లాలగే గతంలో భారత జట్టుకు చాలా నష్టం కలిగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..