Test Records: నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్.. భారత క్రికెట్ చరిత్రలో స్పెషల్ మ్యాచ్.. అదేంటో తెలుసా?

|

Mar 07, 2023 | 12:44 PM

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌తో సహా జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. అయితే, ప్రత్యర్థి జట్టులోని 9 మంది ఆటగాళ్లను మాత్రమే అవుట్ చేయగలిగారు.

Test Records: నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్.. భారత క్రికెట్ చరిత్రలో స్పెషల్ మ్యాచ్.. అదేంటో తెలుసా?
india vs west indies 2002 test antigua
Follow us on

జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం మీరెప్పుడైనా చూశారా? అయితే, ఈ అద్బుతమైన వార్త మీకోసమే తీసుకొచ్చాం. క్రికెట్ చరిత్రలో ఓసారి ఇలా జరిగింది. అది కూడా టీమిండియానే కావడం గమనార్హం. భారత జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశారు. భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

భారత్, వెస్టిండీస్ మధ్య ఈ టెస్టు మ్యాచ్ 2002లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆంటిగ్వా వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లను బౌలర్లుగా ప్రయత్నించాడు.

వికెట్ కీపర్ సహా మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్..

2002లో భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. అజయ్ రాత్రా భారత వికెట్ కీపర్, అతను మ్యాచ్‌లో ఒక ఓవర్ కూడా వేశాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, వసీం జాఫర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనిల్ కుంబ్లే, వీవీఎల్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ తలో 1 వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే..

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వీవీఎస్ లక్ష్మణ్, అజయ్ రాత్రల అద్భుత సెంచరీల కారణంగా భారత జట్టు 9 వికెట్లకు 513 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వీవీఎస్ లక్ష్మణ్ 130 పరుగులు చేయగా, అజయ్ రాత్ర 115 పరుగులు చేశాడు. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్ 91, వసీం జాఫర్ 86 పరుగులు చేశారు. దీంతో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 629 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. వెస్టిండీస్ తరపున కార్ల్ హూపర్ 136, శివనారాయణ్ చంద్రపాల్ 136 పరుగులు చేశారు. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..