CWG 2022: అంచనాలు నిజం చేస్తున్న భారత రెజ్లర్లు.. పట్టుబట్టి.. ఫైనల్ లో అడుగు పెట్టిన భజరంగ్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్
భారతదేశానికి చెందిన స్టార్ త్రయం రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ,అన్షు మాలిక్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (CWG) 2022 లో వారి వారి బరువు కేటగిరీలలో తమ దేశానికి పతకాలను ఖాయం చేశారు.
CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారత రెజ్లర్లు అంచనాలు నిజం చేస్తూ.. పతకాలకు సాధించే దిశగా అడుగులు వేశారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు పట్టుబిగించారు. భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, అన్షు మాలిక్ లు ఫైనల్ లో అడుగు పెట్టారు. పతకాలను ఖాయం చేసుకున్నారు. భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ 57 కేజీల వెయిట్ విభాగంలో ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. 57 కేజీల మహిళల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మాలిక్ శ్రీలంకకి చెందిన నెత్మీ పోరుతోటగేతో తలపడింది. అన్షు ముందు నెత్మీ ఏమాత్రం నిలబడలేకపోయింది. దీంతో సాంకేతిక నైపుణ్యం ఆధారంగా అన్షును విజేతగా ప్రకటించారు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది…
పురుషుల విభాగంలో దీపక్ పునియా కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. 86 కేజీల వెయిట్ విభాగంలో దీపక్ 3-1తో కెనడాకు చెందిన మూర్‌ను ఓడించి ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.
62 కేజీల మహిళల ఫ్రీ స్టైయిల్ విభాగంలో పోటీపడిన భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కి చెందిన క్లేజీ బార్న్‌పై 10-0 తేడాతో భారీ విజయం అందుకుని ఫైనల్‌కి చేరుకుంది.
మరోవైపు 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైయిల్ సెమీ ఫైనల్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా, మారిషస్‌కి చెందిన జీన్ గలిన్ జోరిస్‌ని ఒకే నిమిషంలో ఫాల్‌ఇన్ చేసి ఫైనల్‌కి అర్హత సాధించాడు.
125 కేజీల ఫ్రీ స్టైయిల్ సెమీ ఫైనల్‌లో 2-12 తేడాతో కెనడా రెజ్లర్ చేతుల్లో ఓడిన మోహిత్ గ్రేవల్.. కాంస్య పతక పోటీలో నిలిచాడు.
బ్యాడ్మింటన్‌లో రౌండ్ 16లో పోటీపడిన తెలుగు తేజం పీవీ సింధు ఉగాండాకి చెందిన సుసినా కొబుగాబేతో తలపడింది. 21-10, 21-9 తేడాతో సింధు గెలిచి.. క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టింది.