CWG 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ లో మరో పతకం ఖాయం.. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో

|

Aug 03, 2022 | 7:37 PM

78 కేజీల విభాగంలో తూలికా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో జూడోలో భారత్‌కు మూడో పతకం కూడా ఖాయమైంది. ఈ విభాగంలో బంగారు పతాకంపై ఆశలు పెంచింది.

CWG 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ లో మరో పతకం ఖాయం.. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో
Judoka Tulika Maan
Follow us on

CWG 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌ (Commonwealth Games 2022) జూడోలో (judo) చరిత్ర సృష్టించడానికి తులికా మాన్ (Tulika Maan) రెడీ అవుతోంది. భారత్ కు మరో మెడల్‌ ఖాయమైంది. మహిళల 78 కేజీల విభాగంలో తులికా మాన్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో కనీసం సిల్వర్‌ మెడల్‌ ఖాయమైంది. అవును కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత జూడో క్రీడాకారిణి తులికా మాన్ అద్భుతాలు చేసింది. 78 కేజీల విభాగంలో తూలికా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో జూడోలో భారత్‌కు మూడో పతకం కూడా ఖాయమైంది. ఈ విభాగంలో బంగారు పతాకంపై ఆశలు పెంచింది. ఒకవేళ ఫైనల్లో గెలిస్తే తులికా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకూ కామన్వెల్త్‌ గేమ్స్‌ జూడోలో  ఒక్కసారి కూడా గోల్డ్‌ మెడల్‌ దక్కలేదు. ఒకవేళ తులికా మాన్ ఫైనల్ లో ఓడితే.. కనీసం సిల్వర్‌ మెడల్‌ అయినా దక్కనుంది. ఇప్పటి వరకూ జూడో విభాగంలో సుశీలా దేవి ఇంతకుముందు భారత్‌కు రజత పతకాన్ని అందించింది. విజయ్ కుమార్‌ కూడా దేశానికి కాంస్య పతకాన్ని అందించిన విషయం తెలిసిందే.

తులికా మాన్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు చెందిన సిడ్నీ ఆండ్రూస్‌ని 1 నిమిషం 53 సెకన్లలో ఓడించింది. ఒక ఇప్పోన్‌ తేడాతో తులికా విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. తులికా మాన్ క్రీడాకారిణిగా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. తూలికా తండ్రిని హత్య చేశారు. అప్పటి నుంచి తూలికా అసలు పోరాటం మొదలైంది. వాస్తవానికి, తులికాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. వ్యాపారంలో పోటీ కారణంగా ఆమె తండ్రి సత్బీర్ మాన్ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఢిల్లీలో సబ్-ఇన్‌స్పెక్టర్‌ గా పనిచేస్తోన్న తల్లి తులికను పెంచింది. హఠాత్తుగా తండ్రి మరణంతో ఆ షాక్ నుంచి బయటపడి తునికా కెరీర్‌పై దృష్టి పెట్టింది. అయితే 2018లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం కష్టమైంది. తులికా 4 సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..