విండీస్ జట్టులో క్రిస్‌గేల్‌కు చోటు!

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం విండీస్ బోర్డు జట్టును ప్రకటించింది. విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌కు జట్టులో చోటు కల్పించింది. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాన్ కాంప్‌బెల్, ఆల్ రౌండర్లు రోస్టన్ చేజ్, కీమో పాల్‌కు కూడా జట్టులో చోటిచ్చింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన గేల్ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో 14 మంది జట్టులో గేల్‌కు కూడా చోటు లభించింది. సునీల్ ఆంబ్రిస్, డారెన్ […]

విండీస్ జట్టులో క్రిస్‌గేల్‌కు చోటు!

Edited By:

Updated on: Jul 27, 2019 | 4:04 AM

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం విండీస్ బోర్డు జట్టును ప్రకటించింది. విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌కు జట్టులో చోటు కల్పించింది. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాన్ కాంప్‌బెల్, ఆల్ రౌండర్లు రోస్టన్ చేజ్, కీమో పాల్‌కు కూడా జట్టులో చోటిచ్చింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన గేల్ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో 14 మంది జట్టులో గేల్‌కు కూడా చోటు లభించింది.

సునీల్ ఆంబ్రిస్, డారెన్ బ్రావో, షనాన్ గాబ్రియెల్, ఆష్లీ నర్స్‌లను పక్కనపెట్టింది. గాయం కారణంగా ప్రపంచకప్ మధ్యలో వైదొలిగిన ఆండ్రూ రస్సెల్‌కు కూడా చోటు లభించలేదు. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే గయానాలో ఆగస్టు 8న భారత్-విండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ గేల్ రికార్డులకు వేదిక కానుంది. గేల్ ప్రస్తుతం 10,338 పరుగులతో ఉన్నాడు. మరో 11 పరుగులు సాధిస్తే బ్రియాన్ లారా అత్యధిక పరుగుల రికార్డు బద్దలవుతుంది.

విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), జాన్ కాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షిమ్రాన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, ఫబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, కీమో పాల్, క్రిస్ గేల్, షెల్డన్ కాట్రెల్, ఒషానే థామస్, షాయ్ హోప్, కెమార్ రోచ్.