డాక్టర్ పిచ్చి రాతలు.. : వేటు వేసిన చెన్నై సూపర్ కింగ్స్

|

Jun 17, 2020 | 6:36 PM

పైత్యం విషమిస్తే ఎలావుంటుందంటే.. అచ్చం నాలా ఉంటుందటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వైద్యుడు. దేశ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికులపై పిచ్చి కూతలు కూసి అడ్డంగా బుక్కయ్యాడు...

డాక్టర్ పిచ్చి రాతలు.. :  వేటు వేసిన చెన్నై సూపర్ కింగ్స్
Follow us on

పైత్యం విషమిస్తే ఎలావుంటుందంటే.. అచ్చం నాలా ఉంటుందటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వైద్యుడు. దేశ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికులపై పిచ్చి కూతలు కూసి అడ్డంగా బుక్కయ్యాడు. భారత్‌ చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేవిధంగా ట్వీట్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్ డాక్టర్‌ మధు తొట్టప్పిల్లిల్‌ను జట్టు యాజమాన్యం(జూన్ 14) బుధవారం వేటు వేసింది. మధు తొట్టప్పిల్లిల్‌ అవగాహన రాహిత్యంతో చేసిన ట్వీట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అతను జట్టు డాక్టర్‌ హోదా నుంచి సస్పెండ్‌ చేయబడ్డాడు అని సీఎస్‌కే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

 

 

డాక్టర్‌ మధు సీఎస్‌కే జట్టుకు మొదటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం రాత్రి భారత్‌ చైనా మధ్య ఘర్షణ జరిగిన తరువాత మంగళవారం తొట్టప్పిల్లిల్‌ ఈ ట్వీట్‌ చేశారు. అయితే.. ఇది కాస్తా వైరల్‌గా మారటంతో తన ట్వీట్‌ను తొలిగించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.