
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు గానూ నలుగురు క్రికెటర్ల పేర్లను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ప్రతిపాదించింది. వారిలో మహ్మద్ షమీ, జస్‌ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, పూనమ్ యాదవ్ పేర్లు ఉన్నాయి. ఈ మేరకు తమ సిఫార్సును భారత ప్రభుత్వానికి పంపినట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఇందులో మహిళా జట్టు నుంచి పూనమ్ యాదవ్ ఎంపిక అవ్వడం విశేషం.