క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో రాబోతున్న ఐపీఎల్!

ఐపీఎల్… ఈ లీగ్ ఎప్పుడు వచ్చిందో గానీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. వచ్చిన రెండు సీజన్లలోనే ఈ ఐపీఎల్ జెట్ స్పీడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ధనాధన్ క్రికెట్‌గా.. ఒక పక్క సిక్స్‌లు జోరు.. మరో పక్క వికెట్ల హోరుతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది ఈ మినీ క్రికెట్. ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ ఖచ్చితంగా హౌస్‌ఫుల్ కావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ లీగ్ ద్వారా ఎందరో మేటి క్రికెటర్లు సీనియర్ల సారధ్యంలో వెలుగులోకి […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో రాబోతున్న ఐపీఎల్!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2019 | 9:51 PM

ఐపీఎల్… ఈ లీగ్ ఎప్పుడు వచ్చిందో గానీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. వచ్చిన రెండు సీజన్లలోనే ఈ ఐపీఎల్ జెట్ స్పీడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ధనాధన్ క్రికెట్‌గా.. ఒక పక్క సిక్స్‌లు జోరు.. మరో పక్క వికెట్ల హోరుతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది ఈ మినీ క్రికెట్. ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ ఖచ్చితంగా హౌస్‌ఫుల్ కావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ లీగ్ ద్వారా ఎందరో మేటి క్రికెటర్లు సీనియర్ల సారధ్యంలో వెలుగులోకి రావడం గొప్ప విశేషం.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. అదే ‘పవర్ ప్లేయర్’ నిబంధన. ఆటగాళ్ల సబ్సిట్యూషన్ కోసం ఈ రూల్‌ను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కమిటీ ఈ మేరకు తీర్మానం చేయగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పవర్ ప్లేయర్ రూల్ అంటే ఏంటి..?

వికెట్ పడిన అనంతరం తుది జట్టులోకి ఏ ఆటగాడైనా బ్యాటింగ్‌కు దిగొచ్చు.. అలాగే ఏ తరుణంలోనైనా బౌలర్ ఫీల్డ్‌లోకి వచ్చి బౌలింగ్ చేయొచ్చు. ఇక వీరిని ఎప్పుడు దించాలన్నది తుది నిర్ణయం జట్ల కెప్టెన్లకే వదిలేశారు. దీనికి ఉదాహరణ ఏంటంటే.. ఒక మ్యాచ్‌లో జట్టుకి చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆ సమయంలో టైయిలండర్లు క్రీజులో ఉన్నారు. ఇక ఈ పవర్ ప్లేయర్ నిబంధన ప్రకారం.. డాషింగ్ బ్యాట్స్‌మెన్ రస్సెల్ లాంటి వారిని దింపి.. భారీ షాట్స్‌తో జట్టును గెలిపించవచ్చు. అలాగే బెంచ్‌కు పరిమితమైన బుమ్రా లేదా రబడా లాంటి బౌలర్లను.. చివరి ఓవర్లలో వికెట్లు పొందటానికి రంగంలోకి దింపొచ్చు.

ఇక ఈ రూల్ ఒకవేళ ఐపీఎల్‌లో వస్తే.. గేమ్ స్వభావమే వేరే రకంగా ఉంటుంది. అటు మొదట ఈ ప్రయోగాన్ని ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 టోర్నీలో అమలు చేసి.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అమలు చేయనున్నారని తెలుస్తోంది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..