కామెంటేటర్‌గా ధోనీ..?..’తలైవా’ నయా అవతార్..

ప్రపంచ క్రికెట్‌లో అధిపత్యం ప్రదర్శిస్తున్న ఇండియా..భారత్‌లో క్రికెట్‌ స్థాయిని పెంచేందకు కొత్త మార్గాలు అన్వేశిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో జరగబోతున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ రెడీ అయిపోయింది. అయితే మన దగ్గర క్రికెట్ అంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. మరి అలాంటి కంట్రీ ఓ నూతన స్టెప్ వేయబోతున్నప్పుడు అది ఎంత గ్రాండ్‌గా ఉండాలి..? అందుకే బిసీసీఐ కూడా ఈ మెగా మ్యాచ్‌ను […]

కామెంటేటర్‌గా ధోనీ..?..'తలైవా' నయా అవతార్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2019 | 5:17 AM

ప్రపంచ క్రికెట్‌లో అధిపత్యం ప్రదర్శిస్తున్న ఇండియా..భారత్‌లో క్రికెట్‌ స్థాయిని పెంచేందకు కొత్త మార్గాలు అన్వేశిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో జరగబోతున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ రెడీ అయిపోయింది. అయితే మన దగ్గర క్రికెట్ అంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. మరి అలాంటి కంట్రీ ఓ నూతన స్టెప్ వేయబోతున్నప్పుడు అది ఎంత గ్రాండ్‌గా ఉండాలి..? అందుకే బిసీసీఐ కూడా ఈ మెగా మ్యాచ్‌ను గుర్తుండిపోయేలా చేసేందుకు గేమ్ ప్లాన్ సిద్దం చేస్తోంది.

నవంబర్‌ 22వ తేదీ నుంచి కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగనున్న డే అండ్‌ నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించాలని డిసైడయ్యింది. ఇందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ-  బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాలు కలిసి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాదు మాజీ ప్లేయర్స్ మర్చిపోలేని అనుభూతులను స్టేడియంలోని బిగ్‌స్క్రీన్లపై ప్రసారం చేయడానికి రంగం సిద్దం చేసింది బిసీసీఐ.

మరొకవైపు 2001లో ఆసీస్‌పై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో పాటు ఆ గెలుపులో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నారు. ఇక భారత్‌కి మర్చిపోలేని విజయాన్ని అందిచిన్న మాజీ కెప్టెన్‌ ధోనిని..ఈ మ్యాచ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిపేందుకు బిసీసీఐ పావులు కదుపుతోంది. బంగ్లాతో డే-నైట్ టెస్టుకు ధోనీని గెస్ట్ కామెంటేటర్‌గా ఆహ్వానించాలని స్టార్ ప్రయత్నిస్తోంది. బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధోనీని ఒప్పించగలిగితే.. కామెంటరీ బాక్స్‌లో మహీని చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.