బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అతను కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ అతనిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని , ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా సోమవారం గంగూలీలికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. ఈవిషయం తెలుసుకున్న అభిమానులు దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా అనారోగ్యంతో గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాది మూడోసారి. మొదట జనవరిలో ఛాతిలో నొప్పి రావడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇది జరిగిన 20 రోజులకే మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారీ టీమిండియా మాజీ కెప్టెన్. చికిత్సలో భాగంగా యాంజియోప్టాస్టీ సర్జరీ చేయించుకున్నారు. దీంతో పాటు రక్తనాళాలు బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు కూడా వేయించుకున్నారు. కాగా గతంలో గంగూలీ సోదరుడు, తల్లి కరోనా బారిప పడ్డారు.
BCCI President and former India captain Sourav Ganguly admitted to hospital after testing positive for COVID-19, say BCCI sources
— Press Trust of India (@PTI_News) December 28, 2021
Also Read:
Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్ ఫ్రూట్ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..
Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా క్రికెటర్.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..
ENG vs AUS: మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. యాషెస్ ఆసీస్ కైవసం..